NTV Telugu Site icon

AP News: నాలుగేళ్లలో విషం పెట్టి 80 ఆవులు, ఎద్దులను చంపిన వ్యక్తి.. ఎందుకంటే?

Ap News

Ap News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్ మండలం కమలాపురం గ్రామంలో అందరినీ కలిచివేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి గత నాలుగేళ్లలో గ్రామంలోని సుమారు 80 పశువులకు విషమిచ్చి చంపేశాడు. అతను నిశ్శబ్దంగా ప్రజల ఇళ్లలోని పశువుల కొట్టంలోకి ప్రవేశించి, ఆవులు, ఎద్దులకు విషం పెట్టి అక్కడి నుంచి పారిపోయే వాడు. గ్రామంలో పశువులకు అంటువ్యాధి వచ్చిందని మొదట్లో ప్రజలు అనుకున్నారు. దీంతో ఆవులు, ఎద్దులు ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ఓ రైతు ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలో గుర్తుతెలియని రాత్రి సమయంలో పశువుల కొట్టంలో ఓ వ్యక్తి కనిపించడంతో ఈ మొత్తం ఘటన రహస్యం వెలుగులోకి వచ్చింది.

READ MORE: 26/11 Mumbai Attack: ముంబై టెర్రర్ దాడులకు 16 ఏళ్లు.. ఆనాటి హీరోలను గుర్తుచేసుకుందాం..

అయితే.. తన పశువుల కొట్టంలోకి ప్రవేశించిన వ్యక్తిని యజమాని బుగ్గన శివరామి రెడ్డి అంతగా పట్టించుకోలేదు. మరుసటి రోజు అతడి ఆవు చనిపోయింది. దీంతో ఆ రైతు సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించగా గ్రామానికి చెందిన శంకరాచార్య రహస్యంగా ఆవరణలోకి ప్రవేశించి పశువుల కొట్టానికి వెళ్తున్నట్లు గుర్తించాడు. గత నాలుగేళ్లలో పశువులు అనుమానాస్పదంగా మృతి చెందడంతో యజమాని శివరామితోపాటు పలువురు రైతులు డోన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులకు అందజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శంకరాచార్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఆవుల మృతికి కారకుడు శంకరాచార్య అని ప్రాథమిక విచారణలో తేలింది. కమలాపురంలోని ఆవులు, ఎద్దులను చంపేందుకు శంకరాచార్యులు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో గత నాలుగేళ్లలో 80 ఆవులు, ఎద్దులను చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఆవులను, ఎద్దులను చంపడానికి గల కారణాన్ని పోలీసులు ఈ వ్యక్తిని అడగగా, సమాధానం విని అందరూ ఆశ్చర్యపోయారు. పశువులను చంపడంతో గ్రామంలో పశువుల కొరత ఏర్పడుతుందని, అప్పుడు ప్రతి ఒక్కరూ తన పశువులను వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తారని ఇలా చేసినట్లు విచారణలో వెల్లడైంది.