Alien Temple In Tamilnadu: తమిళనాడులోని సేలం జిల్లా నుంచి ఓ వింత వార్త హల్చల్ చేస్తోంది. రాష్ట్రంలోని మల్లముపంబట్టి నివాసి లోగనాథన్ తన గ్రామంలో గ్రహాంతరవాసుల కోసం ఆలయాన్ని నిర్మిస్తున్నాడు. ఎక్కడైనా మాములుగా దేవుడికి అనేక గదులను నిర్మాణాలను కట్టటం చూస్తుంటాం. ఒకవేళ దేవుళ్లకు మాత్రమే కాకుండా కొంతమంది కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, భర్త, ఇంకా పిల్లలకు దేవాలయాలు నిర్మించిన వార్తలు కూడా విని ఉంటాం. ఇకపోతే అభిమాన నాయకులు, నటినటుల కోసం గుడి కట్టడం కూడా చూసి ఉంటాము. అయితే., గత కొద్దిరోజుల క్రితం నుండి తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏలియన్స్ కు దేవాలయం నిర్మించాడు.
Viral Fever: తెలంగాణలో విజృంభిస్తున్న వైరల్ ఫీవర్.. ఆసుపత్రులన్నీ కిటకిట
ఇక ఈ గుడి నిర్మిస్తున్న లోగనాథన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రకృతి వైపరీత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని.. ఈ విపత్తులను ఆపగలిగే శక్తి కేవలం గ్రహాంతరవాసులకు మాత్రమే ఉందని.. అందుకే గ్రహాంతరవాసుల ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈయన ప్రతిరోజూ ఈ గుడిలో గ్రహాంతరవాసులకు కూడా పూజలు చేస్తున్నాడు. అయితే., ఈ ఆలయ నిర్మాణ పనులు కాస్త నత్త నడకన కొనసాగుతూనే ఉన్నాయి. దాతల సహకారం అందిస్తే మరికొన్ని నెలల్లో పూర్తవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
Tollywood: తంగలాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
ఇకపోతే ఈ ఆలయ నిర్మాణం 2021 నుండి కొనసాగుతుండగా.. ఈ గుడికి లోగనాథన్ గురు సిద్ధ భాగ్య జీవసమాధి అతి సమీపంలో ఉంది. అంతేకాకుండా ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు ఏలియన్స్ కోసం ఎక్కడా గుడి కట్టలేదని లోగనాథన్ తెలిపారు. అయితే ఈ ఆలయం గురించి తెలుసుకున్న వారు చూసేందుకు దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారని చెప్పుకొచ్చారు.