ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ వాతావరణం. ఇంకోవైపు రాష్ట్రపతి భవన్ చుట్టూ భారీ బందోబస్తు. ఇక ఆవరణలో దేశ వ్యాప్తంగా కాకుండా విదేశీ అతిథులతో కోలాహలంగా ఉంది. మోడీ సహా 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగుతోంది.
భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది 72 మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పలు దేశాల ఆహ్వానితులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు పాల్గొన్నారు.