NTV Telugu Site icon

CJI: నీట్-యూజీపై విచారణ.. సీజేఐతో వాగ్వాదానికి దిగిన న్యాయవాది..అసలేమైందంటే..?

Supreme Court Chief Justice

Supreme Court Chief Justice

నీట్-యూజీపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇంతలో సీనియర్ న్యాయవాది చేసిన పని సీజేఐ డీవై చంద్రచూడ్‌కు కోపం తెప్పించింది. ఆ న్యాయవాది, సీజేఐ మధ్య వాగ్వాదం జరిగింది. చీఫ్ జస్టిస్ వెంటనే సెక్యూరిటీని పిలిచారు. న్యాయవాదిని కోర్టు గది నుంచి బయటకు పంపాలని ఆదేశించారు. అయితే సీజేఐ తీవ్ర హెచ్చరిక చేయడంతో న్యాయవాదులు తమ ఇష్టానుసారం వాకౌట్ చేశారు.

READ MORE: Cigarette Prices: బడ్జెట్‌లో పొగాకుపై పెరగని పన్ను.. సిగరేట్ రేట్లు యథాతథం..

పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది నరేంద్ర హుడా నీట్ యూజీపై తన వాదనలు వినిపించారు. అప్పుడు సీనియర్ న్యాయవాది మాథ్యూస్ నెడుంపర మళ్లీ మళ్లీ అడ్డుకోవడం ప్రారంభించారు. ఇండియా టుడే నివేదిక ప్రకారం.. జస్టిస్ చంద్రచూడ్ మొదట అతనికి వివరించారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది నరేంద్ర హుడా వాదనలను అడ్డుకోవద్దని సీజేఐ నెడుంపరను కోరారు. వారి అభిప్రాయాలను తెలియజేనివ్వండని తెలిపారు. కానీ నెడుంపర అంగీకరించలేదు. హుడా చర్చ మధ్యలో ఆయన జోక్యం చేసుకుంటూ.. ‘నేను ఓ విషయం చెప్పాలి’ అన్నారు.

READ MORE:Budget 2024: పేద ఖైదీలకు ఊరట..పెనాల్టీ, బెయిల్ కోసం ఆర్థిక సాయం..

నరేంద్ర హుడా వాదనను పూర్తి చేయనివ్వండి.. ఆ తర్వాత మీరు మీ పాయింట్‌లను చెప్పండి అని సీజేఐ అన్నారు. దీనిపై నెడుంపర మండిపడ్డారు. తాను కోర్టులో సీనియర్ మోస్ట్ లాయర్ అన్నారు. ఆయన తీరుపై సీజేఐ చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయవద్దని హెచ్చరించారు. నెడుంపర వాదిస్తూనే ఉన్నాడు. దీంతో ఆగ్రహించిన సీజేఐ వెంటనే సెక్యూరిటీని పిలిపించాలని ఆదేశించారు. వెంటనే వారిని న్యాయస్థానం నుంచి బయటకు తీసుకెళ్లండి అని ఆదేశించారు. దీనిపై నెడుంపర మాట్లాడుతూ.. ” మీరు నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను బయటకు వెళుతున్నాను.” అని వాకౌట్ చేశారు.

READ MORE:Vulture Population: భారత్‌లో క్షీణించిన రాబందుల జనాభా.. మనుషుల అకాల మరణాలతో లింక్..

24 ఏళ్లుగా న్యాయవ్యవస్థను చూస్తున్నా.. సీజేఐ
గత 24 ఏళ్లుగా న్యాయవ్యవస్థను చూస్తున్నానని సీజేఐ డీవై చంద్రచూడ్‌ అన్నారు. న్యాయవాదులు కోర్టు వ్యవహారాలను నిర్దేశించడాన్ని తాను అనుమతించలేనన్నారు. దీనిపై నెడుంపర మళ్లీ మాట్లాడుతూ తాను 1979 నుంచి న్యాయవ్యవస్థను చూస్తున్నానని చెప్పారు. ఒక న్యాయవాది సీజేఐతో తీవ్ర వాగ్వాదానికి దిగడం ఇదే మొదటిసారి కాదు. మార్చిలో ఎలక్టోరల్ బాండ్లపై విచారణ సందర్భంగా.. సీజేఐ అదే లాయర్‌తో “అరవకండి, మీ మాటలు వినడానికి మేము ఇక్కడ కూర్చోవడం లేదు” అని అన్నారు. అప్పుడు కూడా చర్చలో బలవంతపు ఆరోపణలు వచ్చాయి.