NTV Telugu Site icon

Tirumala: తిరుమలలో భారీ జెర్రిపోతు.. భయంతో పరుగులు తీసిన భక్తులు

Snake

Snake

తిరుమలలో భారీ కొండ చిలువలు, పాములు సంచరించడం మామూలే. అప్పుడప్పుడు జనాల్లోకి వచ్చి భయపెడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా వర్ష కాలం వచ్చిందంటే.. చల్ల ధనానికి అడవిలో నుంచి జనవాసాల్లోకి వస్తాయి. ఇంతకుముందు.. భక్తులకు పాములు, ఎలుగుబంట్లు, చిరుత పులి కూడా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా ఓ భారీ జెర్రిపోతు వీధుల్లోకి వచ్చింది.

Read Also: Prajwal Revanna: కొడుకు స్కూల్ అడ్మిషన్‌కి వెళ్తే వర్చువల్ సె*క్స్ కోసం బలవంతం.. ప్రజ్వల్ రేవణ్ణ దుర్మార్గం..

తిరుమలలో ఓ భారీ పాము హల్చల్ చేసింది. దాదాపు 8 అడుగులుండే ఓ జెర్రిపోతు భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. వెంటనే పాము సంచరిస్తుందని టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో..‌ పాములు పట్టే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని భారీ సైజుతో ఉన్న పామును పట్టుకున్నారు. స్థానికులు తిరిగే డీ‌ టైప్ క్వార్టర్స్ వద్ద ఈ పామును గుర్తించారు. తరువాత దూరంలో అటవీ ప్రాంతంలో జెర్రిపోతు పామును వదిలేశారు. అయితే.. స్నేక్ క్యాచర్ పామును పట్టుకునే విధానం చూస్తే మనకే భయమేస్తుంది. అలాంటిది అతను ఏ మాత్రం భయం లేకుండా పట్టేశాడు. ఎన్నో ఏళ్లుగా తిరుమ‌ల‌, తిరుప‌తిలో విష స‌ర్పాల నుంచి భ‌క్తుల‌ను ర‌క్షిస్తున్నాడు. టీటీడీ ఉద్యోగిగా ప‌నిచేస్తూ ఇప్పటి వ‌ర‌కు 10వేలకు పై చిలుకు పాముల‌ను రెస్క్యూ చేశాడు. రిటైరైనా ఇప్పటికీ టీటీడీలో ఆయన సేవలు అందిస్తున్నారు.

Read Also: Prabhas Fan: ‘కల్కి 2898 ఏడీ’ క్రేజ్.. షాప్ క్లోజ్ చేసిన ప్రభాస్ ఫ్యాన్!

ఇదిలా ఉంటే.. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో కూడా ఓ పాము కలకలం రేపింది. రోడ్డు పై పార్క్ చేసిన బైక్ లోకి వెళ్లింది. దీంతో.. దానిని చూసిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆ పామును బైక్ లో నుంచి బయటకు పంపడానికి అరగంట పాటు శ్రమపడ్డారు. అయితే.. బైక్ నుండి బయటకు రాగానే స్థానికులు పామును చంపేశారు.