NTV Telugu Site icon

Viral: I AM SORRY సంజూ అంటూ ఏకంగా హోర్డింగ్‌ పెట్టిన ప్రియుడు

I Am Sorry

I Am Sorry

ప్రతి ఒక్క ప్రియుడు లేదా ప్రియురాలు తమ లవర్ కు ఎప్పుడో ఒకసారి క్షమాపణ తప్పకుండా చెప్పాల్సిన సమయం వస్తుంది. అలా వచ్చినప్పుడు వారు తమ మనస్సులోని పదాలను లెటర్, మెస్సేజ్ ల రూపంలో చెబుతుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఓ ప్రియుడు మాత్రం తన ప్రేయసికి వెరైటీగా సారీ చెప్పాడు. అతను క్షమాపణలు చెప్పిన విధానం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Read Also: Ee Nagaraniki Emaindi: రీ రిలీజ్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది గా..

సుష్ అనే వ్యక్తి తన ప్రియురాలైన సంజూకి క్షమాపణ చెప్పడానికి ఏకంగా ఓ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ హోర్డింగ్ నెట్టింట వైరల్ అవుతుంది. నోయిడాలో వెలిసిన హోర్డింగ్ ను ఓ ట్విట్టర్ వినియోగదారుడు ఫోటో తీసి అతని అకౌంట్ లో పోస్ట్ చేయడంతో క్షణాల్లో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also: OnePlus Nord 3: వన్ ప్లస్ నార్డ్ 3 ఫోన్ ఫీచర్ లీక్.. ధర ఎంతో తెలుసా?

అయితే ఈ హోర్డింగ్‌లో ఐ యామ్ సారీ సంజు.. ఐ విల్ నెవర్ ఎవర్ హర్ట్ యు ఎగైన్… యువర్ సుష్ అని రాసి ఉంది. అసలు తన గర్ల్‌ఫ్రెండ్‌కి కోపం రావడానికి ఆ అబ్బాయి ఏం చేసాడు అని నెటిజన్స్ వెరైటీ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. అతనికి ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది..? ఎందుకు వచ్చింది..? అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, ఈ హోర్డింగ్ ఉన్న ప్రదేశం గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.

Read Also: Eid al-Adha 2023: భారత్‌లోని ప్రసిద్ధ మసీదుల గురించి మీకు తెలుసా?

సుష్ యొక్క ఆలోచన సంజూ హృదయాన్ని గెలుచుకుందో లేదో మాకు తెలియదు కానీ మా మనస్సును మాత్రం దోచుకుంది అని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్ ఇప్పటికే 234K కంటే ఎక్కువ వీక్షణలు, వేలకొద్దీ లైక్‌లు.. వందల కొద్దీ కామెంట్స్ తో దూసుకుపోతుంది.

Show comments