మన టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరో కొత్త సినిమా విడుదలకు చేసేంత సందడి రీ రిలీజ్ సినిమాకు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలలో పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ చిత్రం అత్యధిక వసూళ్లను సాధించింది.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘సింహాద్రి’ చిత్రం అత్యధిక వసూళ్లను సాధించి టాప్ 2 లో నిలిచింది..స్టార్ హీరోల సినిమాలను రీ రిలీజ్ చేసారు కనుక ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించాయి..కానీ ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేని సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’. ఈ చిత్రాన్ని గ్రాండ్ గా మరోసారి రీ రిలీజ్ చెయ్యబోతున్నారనీ సమాచారం.ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గానే ప్రారంభినట్లు తెలుస్తుంది.
తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో విశ్వక్ సేన్ హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. ఈ సినిమాకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది..ఎప్పటికి బోర్ కొట్టని సినిమాగా నిలిచింది.అలాంటి కల్ట్ క్లాసిక్ సినిమాకి ఇప్పటికీ భారీ క్రేజ్ ఉంది. హైదరాబాద్ సిటీ లో ఈ సినిమాకి జరుగుతున్న బుకింగ్స్ ని చూసి ట్రేడ్ పండితులు షాక్ అవుతున్నారు.టికెట్స్ ఓపెన్ చేసిన నిమిషాల లోనే హాట్ కేక్స్ లాగ టికెట్స్ అమ్ముడయిపోయాయి..ఈ సినిమా విడుదలైన తరువాత రోజే పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ సినిమా కూడా రీ రిలీజ్ కాబోతుంది. ఆ చిత్రానికి కూడా భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి కానీ, ఈ నగరానికి ఏమైంది సినిమా రేంజ్ లో అయితే బుకింగ్స్ మాత్రం జరగడం లేదనీ తెలుస్తుంది..ఈ విషయం అందరినీ షాక్ కి గురి చేసింది.. అయితే ‘ఈ నగరానికి ఏమైంది’ అనే చిత్రం బక్రీద్ పండుగ రోజు మళ్ళీ విడుదల అవుతుంది.పవన్ కళ్యాణ్ తొలిప్రేమ చిత్రం మాత్రం నార్మల్ డే లో విడుదల అవుతుంది కనుక బుకింగ్స్ లో అంత తేడా ఉందని ట్రేడ్ పండితులు చెప్పుకొచ్చారు.. అయితే ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ఏ స్టార్ హీరో రీ రిలీజ్ సినిమాకు అయితే రాలేదు. మరి ఈ చిన్న సినిమా విడుదల అయిన తరువాత కలెక్షన్స్ విషయంలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి..