దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లికించదగ్గ రోజు, ఈరోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 70 లక్షల మంది రైతులకు తొమ్మిది రోజుల్లో రూ. తొమ్మిది వేల కోట్లు వారి ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు. రైతు భరోసా విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన మహాను భావుడు రాజీవ్ గాంధీ అన్నారు. వ్యవసాయం అంటే కాంగ్రెస్… కాంగ్రెస్ అంటే వ్యవసాయమని తెలిపారు. రైతులకు మద్దతు ధర ఇచ్చింది కాంగ్రెస్, రైతులకు నిధులు ఇవ్వాలని చెప్పింది కాంగ్రెస్… దేశంలో గ్రీన్ రెవల్యూషన్ తెచ్చింది కాంగ్రెస్ అని చెప్పారు. రైతులకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని.. భూమి లేని నిరుపేద కుటుంబానికి సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని చెప్పామన్నారు. రైతులకోసం బీఆర్ఎస్ ఏమీ చేయలేదని.. రైతులకు ఇవ్వాల్సిన అన్నింటినీ బంద్ చేసిందని విమర్శించారు. రైతు బంధు పేరుతో అరకొర నిధులు వేశారని ఆరోపించారు. చెప్పిన మాట ప్రకారం తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా ఇచ్చిన ప్రజా ప్రభుత్వాన్ని రైతులు ఆశీర్వదించాలని కోరారు.
READ MORE: AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వీటికి గ్రీన్ సిగ్నల్..
అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. “సంక్షోభం నుంచి సంక్షేమం వైపు వెళ్తున్నాము. ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. రాజీవ్ గాంధీ సూచనల మేరకు ముందుకు వెళ్తున్నాము. కొంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. 25 లక్షల మందికి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు ఇతర పార్టీలకు లేదు. నాడు మన్మోహన్ సింగ్ చేశారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం చేసింది. అప్పటి ప్రభుత్వాలు నెలల తరబడి రైతుబంధు అన్నారు. పూర్తిగా కూడా చేయలేదు. తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా వేశాము. కష్టాలు, ఇబ్బందులు ఉన్నా నిధులు విడుదల చేశాం. పాత పథకాలు ఏవీ తీసివేయలేదు. గ్రామీణ తెలంగాణ మా గుండెల్లో ఉంటుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లక్ష కోట్లు రైతులకు ఖర్చు చేశాం. మాకు ప్రజలు ఐదు సంవత్సరాలు ప్రజలు సమయం ఇచ్చారు. మేము ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చి ప్రజల ముందుకు వెళతాం.” అని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు.
READ MORE: Adilabad: రూ.10 ఇచ్చి మైనర్ బాలికపై యువకుడి అఘాయిత్యం.. ఎలా బయటపడిందంటే..?