ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ స్వాతి మలివాల్‌పై బిభవ్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన గతంలో అరెస్టయ్యారు. నేడు జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కోర్టు బిభవ్‌ను తీవ్రంగా మందలించింది. ఒక మహిళతో ఇలా ప్రవర్తించినందుకు సిగ్గు లేదా? అంటూ ప్రశ్నించింది.
READ MORE: Paris Olympics 2024: సాదాసీదాగా వచ్చి.. రజత పతకం గెలిచిన 51 ఏళ్ల టర్కీ షూటర్! అదెలాగబ్బా
బిభవ్ తరపున హాజరైన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. ఈ ఘటనపై మూడు రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. మలివాల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండానే తిరిగి వచ్చారన్నారు. చార్జిషీట్‌పై కోర్టు ప్రశ్నించగా.. మేం సవాల్ చేసిన ఆదేశాల మేరకే చార్జిషీట్ దాఖలు చేశామని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. రెండు హత్య కేసుల్లో నిందితులకు బెయిల్ లభించడాన్ని సింఘ్వి ఉదహరించారు. అయితే ఆ కేసుల గురించి తమకు సూచనలు ఇవ్వొద్దని.. జస్టిస్ సూర్యకాంత్ మండిపడ్డారు.
READ MORE: Paris Olympics 2024: ఫైనల్ కి చేరిన భారత షూటర్ స్వప్నిల్.. ధోని నుంచి ప్రేరణ
” ఆ కేసుల గురించి మాకు సూచనలివ్వొద్దు. ఎందుకంటే ఇక్కడ సంఘటన ఎలా జరిగిందనేది మా ఆందోళనకు కారణం. ఒక స్త్రీతో ఇలా ప్రవర్తించినందుకు సిగ్గు లేదా? కాంట్రాక్ట్ కిల్లర్లకు, హంతకులకు బెయిల్ ఇస్తాం. కానీ ఈ విషయంలో కాదు.” అని ఘాటుగా స్పందించారు. చాలా కఠినమైన వైఖరిని అవలంబిస్తూ, కోర్టు ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేసింది. బిభవ్ బెయిల్ దరఖాస్తుపై స్పందన కోరింది. తదుపరి విచారణ ఆగస్టు 7వ తేదీ బుధవారానికి వాయిదా వేసింది.