Site icon NTV Telugu

Criminal Escape: పోలీసుల కళ్లు గప్పి పరారైన కరడుగట్టిన నేరస్తుడు..

Criminal

Criminal

పోలీసుల కళ్లు గప్పి కరడుగట్టిన నేరస్తుడు పరారైన ఘటన యూపీలో చోటుచేసుకుంది. కాన్పూర్‌లోని లాలా లజ్‌పత్ రాయ్ హాలెట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నేరస్తుడు పోలీసులను నుంచి బయటపడ్డాడు. ఈ క్రూరమైన నేరస్తుడు నకిలీ ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తూ ప్రజల నుంచి దోపిడీలకు పాల్పడుతున్నడనే నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేశారు. అయితే అతని కాలికి గాయం కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పుడు నిందితుడు పారిపోయాడన్న విషయంతో పోలీసు శాఖలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

America: బైడెన్ మనవరాలికి భద్రతా లోపం.. కాల్పులు జరిపిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు

ఈ ఘటనపై ఆస్పత్రిలో విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను జలౌన్ ఎస్పీ సస్పెండ్ చేశారు. అంతేకాకుండా.. వారిపై శాఖాపరమైన విచారణ ప్రారంభించారు. మరోవైపు.. పరారీలో ఉన్న నేరస్తుడిని పట్టుకునేందుకు కాన్పూర్ పోలీసులతో పాటు జలౌన్ పోలీసులు బృందాలుగా ఏర్పడి అతని కోసం గాలిస్తున్నారు. ఆ నేరస్తుడు జితేంద్ర సింగ్ పరిహార్‌ గా పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆ నేరస్తుడి కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. నేరస్తుడు పరారీలో ఉండడంతో పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. నేరస్తుడిని పట్టుకునేందుకు జలౌన్ పోలీసు సూపరింటెండెంట్, కాన్పూర్ పోలీసుల సహాయంతో బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని అన్నారు.

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ.. దానికోసం ఆగలేకపోతుందంట.. ?

పోలీసుల అదుపు నుంచి తప్పించుకున్న నకిలీ ఇన్‌స్పెక్టర్‌పై వివిధ ప్రాంతాల్లో 21 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. నవంబర్ 10న ఒరై కొత్వాలి ప్రాంతంలో ఈ నకిలీ ఇన్‌స్పెక్టర్ పై ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నేరస్తుడి కుడి కాలుకు గాయమైంది. దీంతో అతన్ని చికిత్స కోసం హాలెట్ ఆసుపత్రిలో చేర్చారు.

Exit mobile version