Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన. దాదాపు ఎన్నో ఏళ్లుగా ఈ భామ తెలుగు, తమిళ్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఈ మధ్యనే ఈ ముద్దగుమ్మ బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అక్కడ సక్సెస్ ను అందుకుందో లేదో తెలియదు కానీ.. బాయ్ ఫ్రెండ్ ను మాత్రం సంపాదించుకుంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో అమ్మడి ప్రేమాయణం చాలా దూరం వచ్చేసింది. ఈ ఏడాది మొదట్లో పార్టీలో లిప్ కిస్ పెడుతూ దొరికిన ఈ జంట.. ఆ తరువాత ప్రతిసారి .. ప్రతిచోట అడ్డంగా దొరుకుతూనే ఉన్నారు. ఇక దీంతో దాచేది ఏమి లేదని తమ్ము కూడా ఓపెన్ అయ్యింది. తన జీవితంలో విజయ్ లాంటి వ్యక్తిని చూడలేదని ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చేసిన ఈ భామ.. చక్కగా పార్టీలకు, ఈవెంట్స్ కు బాయ్ ఫ్రెండ్ ను వేసుకొని తిరుగుతుంది. ఇక బాలీవుడ్ మీడియా ప్రకారం.. ప్రస్తుతం అమ్మడు మనసు పెళ్లి మీదకు మళ్లిందని తెలుస్తోంది.
Akkineni Naga Chaitanya: అన్ని అయిపోయాయి.. ఇక దీని మీదనే ఆశలన్నీ.. ఏం చేస్తావో ఏమో.. ?
తమన్నా ఇంట్లో పెళ్లి ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో ఇక ఆగలేక.. ముద్దుగుమ్మ పెళ్ళికి ఓకే చెప్పినట్లు సమాచారం. విజయ్ కుటుంబ వర్గాలకు కూడా తమన్నా నచ్చడంతో వీరి పెళ్లి త్వరలోనే జరగనుందని టాక్. అయితే తమన్నా, విజయ్ చేతిలో ప్రస్తుతం కొన్ని మూవీస్ ఉండడంతో వాటిని ఫినిష్ చేసి.. వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి వేడుకలు మొదలుకానున్నాయని సమాచారం. డిసెంబర్ చివరి వారంలో కానీ, జనవరి మొదటి వారంలో కానీ వీరి ఎంగేజ్ మెంట్ ఉంటుందని, ఫిబ్రవరిలో పెళ్లి జరగనుందని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తమన్నానే చెప్పాలి.