Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
- ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేశారు..
- విప్రో మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు..
- టీసీఎస్ నాసిక్ ఉదంతం తర్వాత మరో ఐటీ దిగ్గజంపై ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Religious Conversion: నాసిక్ టీఎసీఎస్ క్యాంపస్ మతమార్పిడి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కిందిస్థాయి ఉద్యోగులు, మహిళలపై ఉన్నతాధికారుల వేధింపులు, బలవంతంగా మతమార్పిడి, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది. ఈ ఘటన మరవక ముందే ఇప్పుడు మరో సాఫ్ట్వేర్ దిగ్గజం విప్రోపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. విప్రో పూణే క్యాంపస్లో పనిచేసిన ఓ మాజీ మహిళా ఉద్యోగి సంచలన ఆరోణపలు చేసింది. తన ఉన్నతాధికారి మత విశ్వాసాల కారణంగా వేధింపులకు గురిచేశాడని, ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పుణేలోని హింజేవాడి విప్రో క్యాంపస్లో పనిచేస్తున్న సమయంలో కొందరు సీనియర్ మేనేజర్లు, టీమ్ లీడర్లు తన మత విశ్వాసాలను లక్ష్యంగా చేసుకుని వేధించారని ఆమె ఆరోపించింది.ఇస్లాం మతంలోకి మారాలి, మతానికి సంబంధించిన ఆచారాలు పాటించాలని మానసికంగా వేధించినట్లు చెప్పింది. ఇందుకు నిరాకరించినందుకు తనకు వేధింపులు పెరిగాయని, పర్ఫామెన్స్ రివ్యూల్లో చెడుగా రేటింగ్ ఇస్తామని, ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరించినట్లు ఆరోపించింది. ఈ మానసిక వేధింపుల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పింది. సంస్థ అంతర్గత ఫిర్యాదు వ్యవస్థ నుంచి కూడా తనకు సరైన మద్దతు రాలేదని పోలీసులతో పాటు మానవహక్కుల సంస్థలో ఫిర్యాదుచేసింది.
Also Read
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
- Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
ఈ వ్యవహారంపై పూణ పోలీస్ అధికారి బాలాజీ పంధారే మాట్లాడుతూ.. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై విప్రో స్పందించింది. ఉద్యోగుల సంక్షేమం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది. వివక్ష, వేధింపులు, మానవ హక్కుల ఉల్లంఘన పట్ల ‘‘జీరో టాలరెన్స్’’ విధానాన్ని పాటిస్తున్నామని చెప్పింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నందువల్ల వివరాలు వెల్లడించలేదని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెప్పింది.
తాజావార్తలు
-
Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
-
Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
-
Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
-
Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!