Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
- ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేశారు..
- విప్రో మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు..
- టీసీఎస్ నాసిక్ ఉదంతం తర్వాత మరో ఐటీ దిగ్గజంపై ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Religious Conversion: నాసిక్ టీఎసీఎస్ క్యాంపస్ మతమార్పిడి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కిందిస్థాయి ఉద్యోగులు, మహిళలపై ఉన్నతాధికారుల వేధింపులు, బలవంతంగా మతమార్పిడి, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది. ఈ ఘటన మరవక ముందే ఇప్పుడు మరో సాఫ్ట్వేర్ దిగ్గజం విప్రోపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. విప్రో పూణే క్యాంపస్‌లో పనిచేసిన ఓ మాజీ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. తన ఉన్నతాధికారి మత విశ్వాసాల కారణంగా వేధింపులకు గురిచేసినట్లు, ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పుణేలోని హింజేవాడి విప్రో క్యాంపస్‌లో పనిచేస్తున్న సమయంలో కొందరు సీనియర్ మేనేజర్లు, టీమ్ లీడర్లు తన మత విశ్వాసాలను లక్ష్యంగా చేసుకుని వేధించారని ఆమె ఆరోపించింది.ఇస్లాం మతంలోకి మారాలి, మతానికి సంబంధించిన ఆచారాలు పాటించాలని మానసికంగా వేధించినట్లు చెప్పింది. ఇందుకు నిరాకరించినందుకు తనకు వేధింపులు పెరిగాయని, పర్ఫామెన్స్ రివ్యూల్లో చెడుగా రేటింగ్ ఇస్తామని, ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరించినట్లు ఆరోపించింది. ఈ మానసిక వేధింపుల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పింది. సంస్థ అంతర్గత ఫిర్యాదు వ్యవస్థ నుంచి కూడా తనకు సరైన మద్దతు రాలేదని పోలీసులతో పాటు మానవహక్కుల సంస్థలో ఫిర్యాదుచేసింది.
Also Read
ఈ వ్యవహారంపై పూణ పోలీస్ అధికారి బాలాజీ పంధారే మాట్లాడుతూ.. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై విప్రో స్పందించింది. ఉద్యోగుల సంక్షేమం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది. వివక్ష, వేధింపులు, మానవ హక్కుల ఉల్లంఘన పట్ల ‘‘జీరో టాలరెన్స్’’ విధానాన్ని పాటిస్తున్నామని చెప్పింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నందువల్ల వివరాలు వెల్లడించలేదని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెప్పింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?