Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం
- భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- భద్రతా కారణాలతో ప్రత్యేక ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు నటి ట్విషా శర్మ కేసులో నిందితులుగా ఉన్న అత్త గిరిబాలాసింగ్, భర్త సమర్థ్‌సింగ్ జైల్లో రాజభోగం అనుభవిస్తున్నట్లుగా తెలుస్తోంది. భోపాల్ జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తులో ఉన్న ఈ కేసులో ఇద్దరూ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో భోపాల్ సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే సాధారణ ఖైదీల మాదిరిగా కాకుండా జైలు ఆస్పత్రిలో ఉంచి వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.
మాజీ జిల్లా న్యాయమూర్తి అయిన గిరిబాలా సింగ్‌ను భద్రతా కారణాల పేరుతో జైలు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. గతంలో తాను శిక్ష విధించిన ఖైదీలు అదే జైలులో ఉన్నారని.. తన ప్రాణాలకు ముప్పు ఉందని కోర్టును ఆశ్రయించారు. ఆమె వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుని భద్రత కల్పించాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ట్విషా భర్త సమర్థ్ సింగ్‌ను గాయాల కారణంగా జైలు ఆస్పత్రిలో ఉంచినట్లు సమాచారం. దీంతో తల్లి, కొడుకులిద్దరూ జైలు ఆస్పత్రిలోనే ఉండటం వివాదాస్పదంగా మారింది.
Also Read
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
జూన్ 2న భోపాల్ సెంట్రల్ జైలులో భద్రత కల్పించాలని గిరిబాలా సింగ్ కోర్టును కోరారు. తన న్యాయ సేవా కాలంలో భోపాల్‌లో అనేక కేసులకు తీర్పులు ఇచ్చానని, ప్రస్తుతం అదే జైలులో ఉన్న కొందరు ఖైదీలు తన చేత శిక్షపడిన వారేనని పేర్కొన్నారు. అందువల్ల తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో తన కుమారుడు సమర్థ్ సింగ్‌పై ట్విషా కుటుంబం తరఫు న్యాయవాది దాడి చేశారని ఆరోపించారు. కేసు ప్రారంభం నుంచి తాము మీడియా ట్రయల్‌ను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.
మీడియా కవరేజీపై అభ్యంతరం
సీబీఐ దర్యాప్తునకు సంబంధించిన విషయాలు మీడియాలో ఎక్కువగా రావద్దని గిరిబాలా సింగ్ కోర్టును కోరినట్లు సమాచారం. జైలు తరలింపు సమయంలో మీడియా నుంచి రక్షణ కల్పించాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు న్యాయవాదులు తెలిపారు. ట్విషా కుటుంబం తరఫున వాదిస్తున్న న్యాయవాది అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. తమపై, మీడియా ప్రతినిధులపై జబల్పూర్ కోర్టు దగ్గర కొందరు న్యాయవాదులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. కోర్టులో జరిగిన ఘటనలపై సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని కూడా డిమాండ్ చేశారు.
కేసు నేపథ్యం
మే 12న భోపాల్‌లోని తన అత్తింట్లో ట్విషా శర్మ ఉరివేసుకుని మృతిచెందిన స్థితిలో కనిపించారు. ఆమె కుటుంబ సభ్యులు వరకట్న వేధింపులే మరణానికి కారణమని ఆరోపించారు. కేసు తీవ్ర సంచలనం రేపడంతో దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. సీబీఐ కస్టడీ ముగియడంతో ట్విషా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్‌లను కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!