ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆస్తితో పాటు ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. తాజాగా హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల ఆరోరా పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్ లో కెమికల్ మిక్స్ చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో సూరారానికి చెందిన కార్మికుడు అనిల్ కుమార్ మృతి చెందగా, మరో ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి.. గాయపడిన కార్మికులను సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కు గుట్టు చప్పుడు కాకుండా తరలించారు.. ఆ తర్వాత బంధువులకు సమాచారమిచ్చారు. కంపెనీ దగ్గరకు చేరుకున్న బాధిత బంధువులకు సమాచారం ఇవ్వడం లేదు. ఘటన స్థలానికి చేరుకున్న సూరారం పోలీసులు, ఫైర్ సిబ్బంది ఎందుకు సమాచారం ఇవ్వలేదని యాజమాన్యాన్ని ప్రశ్నించారు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: Virat Kohli: ఈ పదేళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా.. కోహ్లీ పోస్ట్ వైరల్! గందరగోళంలో ఫాన్స్
కాగా.. గతేడాది మార్చి ఒకటిన కూడా ఆరోరా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ పరిశ్రమలో రియాక్టర్ పేలి చెలరేగిన మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వారు ఈ పరిశ్రమలో కార్మికులుగా పని చేస్తున్నట్లు తెలిసింది. కార్మికులు రవీందర్‌రెడ్డి(25), కుమార్(24)గా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
READ MORE:Winter Foods to Eat: చల్లగా ఉందని వేడి వేడిగా బజ్జీలు, పకోడీలు చిరుతిళ్లు లాగిస్తున్నారా?