ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆస్తితో పాటు ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. తాజాగా హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల ఆరోరా పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్ లో కెమికల్ మిక్స్ చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో సూరారానికి చెందిన కార్మికుడు అనిల్ కుమార్ మృతి చెందగా, మరో ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి..