మియాపూర్ బాలిక అనుమానాస్పద కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బాలిక వసంతని తండ్రి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మియాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. తండ్రి నరేష్ బాలికను నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్లి తన కోరికను తీర్చాలని బలవంత పెట్టాడు. తండ్రి కోరిక విని గట్టిగా అరిచింది ఆ బాలిక.. తండ్రి వ్యవహారాన్ని తల్లికి చెప్తానని బెదిరించింది. పోర్న్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యాడు బాలిక తండ్రి బానోతు నరేష్.. తన కోరిక తీర్చాలంటూ బాలిక పై ఒత్తిడి తెచ్చాడు. అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని హతమార్చాడు. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య చేశాడు. బాలికను హతమార్చి నిర్మానుష్య ప్రాంతం నుంచి బయటకు వచ్చాడు. వారం రోజుల తర్వాత బాలిక మిస్సింగ్ మిస్టరీ బయటపడింది. ఇంటి సమీపంలోనే బాలిక మృతదేహం లభ్యమైంది. తండ్రిపై అనుమానంతో తమదైన తీరులో పోలీసుల దర్యాప్తు కొనసాగించారు. తండ్రి నరేష్ 11 నిమిషాల వ్యవధిలోనే బాలిక ను హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి బయటకు వచ్చాడు. బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు మరోసారి హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లాడు. వరుసగా మూడు రోజుల పాటు బాలిక మృతదేహాన్ని చూస్తూ వచ్చాడు.
READ MORE: CM Chandrababu: రేపు రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన..
తన కూతురు మిస్ అయినట్లు నరేష్ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి నరేష్.. వారం రోజుల పాటు అస్సలు విషయం దాచాడు. నరేష్ హత్య చేసినట్లుగా పోలీసుల నిర్ధారించారు. స్వగ్రామం మహబూబబాద్ జిల్లా మర్రిపెడ మండల్ ఎల్లంపేట్ గ్రామం లక్ష్మన్ తండా అని తెలిపారు. బ్రతుకుదెరువు కోసం నరేష్ కుటుంబం నడిగడ్డ తండాకు వలసవచ్చింది. వచ్చిన 15 రోజులకే కన్న కూతురును హత్య చేశాడు కసాయి తండ్రి. నాలుగు బృందాలతో సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించారు. మియాపూర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.