Site icon NTV Telugu

Bihar: చెప్పుడు మాటలు విని కన్న కూతురిని హత్య చేసిన తండ్రి..

Murder

Murder

బీహార్‌లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ముంగేర్ జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. మద్యం మత్తులో తండ్రి కూతురిని హత్య చేశాడు. అనంతరం.. ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇంట్లో దాచిపెట్టాడు. రాత్రి సమయంలో మృతదేహాన్ని బయట పడేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనాస్థలానికి చేరకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also: T20 WC: టీ20 వరల్డ్ కప్ టీమ్ను ఎంపిక చేసిన టీమిండియా మాజీ క్రికెటర్..

వివరాల్లోకి వెళ్తే.. ముబారక్‌చక్ నట్వా టోలీకి చెందిన మహ్మద్ బహల్ గత రాత్రి మద్యం మత్తులో తన కూతురును దారుణంగా హత్య చేసినట్లు ముఫాసిల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలిక మృతి చెందినట్లు గుర్తించారు. బాలిక తల వెనుకాల బలమైన గాయంకావడంతో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై బాలిక తల్లి ఖుష్బూ పర్వీన్ పోలీసులకు వివరాలు తెలిపింది. తన భర్త మద్యానికి బానిసయ్యాడని, వృత్తి రీత్యా పాములు పడుతాడని తెలిపింది. అయితే.. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తమ కుమార్తె గురించి చెడుగా భర్త బహల్‌కు చెప్పాడని పేర్కొంది. తన కూతురికి ఓ యువకుడితో అక్రమ సంబంధం ఉందని కొందరు వ్యక్తులు తన భర్తకు చెప్పారని.. దీంతో.. ఆవేశంతో ఇంటికి వచ్చి రాడ్ తో తలపై కొట్టి హత్య చేశాడని తెలిపింది. మరొకసారి.. చేతిపంపు నుంచి నీటిని నింపుతుండగా మూర్ఛ వచ్చి కిందపడి చనిపోయిందని బాలిక తల్లి పోలీసులకు తెలిపింది. ఇలా.. బాలిక మృతి విషయంపై తల్లి అబద్ధాలు చెబుతుండటంతో మృతదేహాన్ని పోలీసులు తమ కస్టడీకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు.

Exit mobile version