Doctor: విమానంలో పాడు పని.. అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న 14 ఏళ్ల బాలిక పట్ల ఓ డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దుప్పటి మెడ వరకు కప్పుకుని హస్త ప్రయోగం చేశాడు. అతడు భారత సంతతికి చెందిన డాక్టర్ సుదీప్త మొహంతి అని గుర్తించారు. అతను బోస్టన్ లోని బెత్ ఇజ్రాయెల్ డీకోనెస్ మెడికల్ సెంటర్ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఓ మహిళతో కలిసి విమాన ప్రయాణం చేస్తున్న డాక్టర్.. ఈ పాడు పని చేశాడు. ఈ ఘటన గతేడాది మే నెలలో హవాయి దీవుల్లోని హోనోలులూ నుంచి బోస్టన్ నగరానికి విమానం వెళుతుండగా జరిగింది. ఆ తర్వాత అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అతడిని అరెస్ట్ చేసింది.
WC 2023: ఇండియాలో మనకు ఎవరు సపోర్ట్ ఇవ్వరు..
Also Read
తన బామ్మ, తాతయ్యతో కలిసి బోస్టన్ వెళుతున్న ఆ టీనేజీ అమ్మాయి.. పక్కసీట్లో కూర్చున్న ఆ డాక్టర్ దుప్పటి కదులుతుండటం గమనించింది. అంతేకాకుండా కాళ్లు, చేతులు పైకి కిందికీ అంటూ ఉండటంతో.. కాసేపటికి దుప్పటి కిందపడిపోయిది. దీంతో డాక్టర్ మొహంతి హస్తప్రయోగం చేస్తుండడాన్ని ఆ బాలిక చూసింది. దాంతో షాకైన ఆ బాలిక మరో వరుసలో ఖాళీగా ఉన్న సీట్లోకి వెళ్లి కూర్చుంది. విమానం దిగిన తర్వాత డాక్టర్ చేసిన పాడు పని గురించి తన తల్లిదండ్రులతో చెప్పింది. దాంతో వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే విమానంలో తానేమీ చేయలేదని డాక్టర్ మొహంతి బుకాయించే ప్రయత్నం చేశాడు. ఆధారాలను బట్టి అతడు విమానంలో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు గుర్తించారు.
Pushpa 2: ఆల్ టైం రికార్డు బద్దలు కొట్టిన పుష్ప 2
అయితే డాక్టర్ మొహంతిని గురువారం నాడు అరెస్ట్ చేసి ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు ఎఫ్ బీఐ పోలీసులు. కోర్టులో నేర నిరూపణ అయితే, అతనికి 90 రోజుల జైలు, 5 వేల డాలర్ల జరిమానా, ఏడాది పాటు పోలీసుల పర్యవేక్షణలో సామాజిక జీవనం శిక్ష ఖరారు చేసే అవకాశాలున్నాయి. అయితే ఈ కేసులో డాక్టర్ వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ లభించడంతో రిలీజ్ అయ్యాడు. ఈ క్రమంలో కోర్టు అతనికి కొన్ని షరతులు విధించింది. బెయిల్ కాలంలో 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారికి దూరంగా ఉండాలి. 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు గుమికూడే ప్రదేశాలకు కూడా వెళ్లరాదంటూ కోర్టు స్పష్టం చేసింది.
- Tags
- Doctor
- FBI
- Flight
- girl
- Lewd Behavior
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!