NTV Telugu Site icon

TTD: సరోగసీ విధానం ద్వారా జన్మించిన ఆవు.. ఏపీలో ఇదే తొలిసారి, టీటీడీ ఈవో ప్రకటన

Cow

Cow

TTD: ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతం జరిగింది. సరోగసీ తల్లి ఆవు ద్వారా మరో ఆవు జన్మించింది. ఏపీలో ఇలా ఆవిష్కృతం కావడం ఇదే తొలిసారి అని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. కొత్తగా పుట్టిన ఆవుకు ‘పద్మావతి’గా నామకరణం చేశామన్నారు. గిర్ ఆవు పిండం.. ఒంగోలు ఆవు గర్భంలో ప్రవేశ పెట్టడం జరిగిందని చెప్పారు. దేశీయ ఆవు పాల ఉత్పత్తి చేయాలన్నదే తమ లక్ష్యమని, తద్వారా వెన్న, నెయ్యిని అధికంగా ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం 3.8 కోట్లు టీటీడీ ద్వారా ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీకి ఇచ్చినట్లు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. రానున్న ఐదేళ్లలో మరిన్ని ఆవులను సరోగసీ విధానం ద్వారా పుట్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికారులు.

Also Read: America: 16నెలల చిన్నారిని ఇంట్లో పెట్టి 10రోజులు పరారైన తల్లి.. తిరిగొచ్చే సరికి దారుణం

ఏపీలో మొదటిసారి సరోగసీ తల్లి ఆవు ద్వారా మరో ఆవు జన్మించడం సంతోషమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. దేశీయ ఆవులు అంతరించిపోతున్న నేపథ్యంలో సరోగసీ విధానం ద్వారా ఆవులను అభివృద్ధి చేస్తున్నామని ధర్మారెడ్డి చెప్పారు. గో ఆధారిత వ్యవసాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 11 ఆవులకు ఎంబ్రియో ఆవులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏడాదికి 94 సరోగసీ ఆవు దూడలు పుట్టించేందుకు సిద్ధం చేశామని, సాహివాల్ ఎంబ్రీయో ఆవులను ఒంగోలు జాతి ఆవులలో అభివృద్ది చేసినట్లు తెలిపారు. రోజుకు 60 కిలోల నెయ్యి శ్రీవారి ఆలయంలో అవసరం ఉందని, స్వచ్ఛమైన పాలను స్వామివారు, అమ్మవారికి అందించాలనే ఉద్దేశంతో దేశీయ ఆవులను అభివృద్ధి చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇప్పటికే 200 దేశీయ గోవులను దాతలు సమకూర్చారని, మరో 300 గోవులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

Also Read: Surekha Vani: డ్రగ్స్ కేసు.. దయచేసి నన్ను.. నా కుటుంబాన్ని నాశనం చేయకండి

శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ.. స్వదేశీ ఆవుల సంతతి పెంచుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉందన్నారు. ఐఈవీఈ టెక్నాలజీ ద్వారా ఒక ఆవు నుంచి పది నుంచి 15 వరకు పిండాలు సేకరించి అద్దె గర్భం ఆవుల్లో ప్రవేశపెడుతున్నామని చెప్పారు. సరోగసీ ద్వారా అధిక పాలు ఉత్పత్తి చేయడం ద్వారా 530 ఆవు దూడలు, మొదటి ఏడాది 36 ఆవు దూడలు పుట్టించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పద్మనాభ రెడ్డి తెలిపారు.

Show comments