మొన్నటివరకు వీధి కుక్కలు మనుషులను ఆటాక్ చేసి చంపేస్తున్నాయి.. ఇప్పుడు వీధుల్లో తిరుగుతున్న ఆవులు కూడా మనుషుల పై పగబట్టి చంపేస్తున్నాయి.. సడెన్ గా దాడులకు తెగబడుతున్నాయి. కొమ్ములతో కుమ్మి కుమ్మి పడేస్తున్నాయి. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కుక్కలు, ఆవులు, ఎద్దుల దాడుల ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా గుజరాత్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ ఆవు రెచ్చిపోయింది. ఓ యువకుడిపై దాడి చేసింది. వీధుల్లో అతడిని పరిగెత్తించిన ఆవు.. కొమ్ములతో దాడి చేసి గాయపరిచింది. ఆ ఆవు తీరు చూస్తే పగబట్టిన పాములా అనిపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది..
వివరాల్లోకి వెళితే.. మెహసానా జిల్లాలో ఒళ్లుగగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. ఓ ఆవు యువకుడిని తరిమింది. వీధుల వెంబడి పరిగెత్తించింది. చాలాసేపు అతడి వెనుకే పరిగెత్తింది. ఆ తర్వాత కొమ్ములతో పొడిచి దాడి చేసింది. ఆ యువకుడు తప్పించుకుందామని ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆవు వెంట పడి మరీ, పరిగెత్తించి మరీ దాడి చేసింది.. ఈ దాడిని చూసిన కొందరు ఆవును ఆపేందుకు ప్రయత్నం చేశారు..కానీ ప్రయోజనం లేకపోయింది..ఆవు దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆవు దాడిని కళ్లారా చూసినోళ్లు షాక్ కి గురయ్యారు. భయంతో ఒళ్లంతా చెమట్లు పట్టేశాయి. ఆ ఆవు తీరుతో అంతా అవాక్కయ్యారు…
అయితే, రోడ్డు మీద అంతమంది వెళ్తున్నా.. ఆ ఆవు కేవలం అతడిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేసింది?.. అతడు గతంలో ఆవును ఏదైనా అన్నాడా.. లేదా ఏదైనా చేశాడా అనే విషయం తెలియలేదు కానీ ఈ దాడిని చూస్తే మాత్రం కళ్లు భైర్లు కమ్మాల్సిందే.. దేశవ్యాప్తంగా రోడ్లపై పశువుల సంచారం పెరిగింది. రోడ్లపై విచ్చల విడిగా ఆవులు, ఎద్దులు సంచరిస్తున్నాయి. రోడ్డు మీద వెళ్లే వారిపై సడెన్ గా దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో రోడ్లపై పశువుల సంచారాన్ని అరికట్టాలనే డిమాండ్లు కూడా మరో వైపు వినిపిస్తున్నాయి..
https://t.co/8zB5dulFmQ #viralvideo #viral #Trending #Gujarat #GujaratiNews #surat #cow #Mehsana #Accident
— Bhilai भिलाई (@Bhilai) September 4, 2023