మొన్నటివరకు వీధి కుక్కలు మనుషులను ఆటాక్ చేసి చంపేస్తున్నాయి.. ఇప్పుడు వీధుల్లో తిరుగుతున్న ఆవులు కూడా మనుషుల పై పగబట్టి చంపేస్తున్నాయి.. సడెన్ గా దాడులకు తెగబడుతున్నాయి. కొమ్ములతో కుమ్మి కుమ్మి పడేస్తున్నాయి. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కుక్కలు, ఆవులు, ఎద్దుల దాడుల ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా గుజరాత్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ ఆవు రెచ్చిపోయింది. ఓ యువకుడిపై దాడి చేసింది. వీధుల్లో అతడిని…
స్కూలు నుంచి ఇంటికి తిరిగివెళ్తున్న బాలికను ఓ ఆవు కొమ్ములతో దాడి చేసింది. రోడ్డుపైనే కొమ్ములతోనే ఆమెను కమ్మేసి నేలపై పడేసింది. ఆ తర్వాత పలుమార్లు బాలికను కొమ్ములతో పొడిచింది. కిందపడిపోయిన ఆ పాప కడుపులో కాళ్లతో తన్నింది.