Laila : టాలీవుడ్ హీరోలలో ఒకరైన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలలో చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఈ మధ్యనే ‘ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ‘ సినిమాలో ప్రేక్షకులకు ముందు వచ్చి మెప్పించాడు ఈ కుర్ర హీరో. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకు కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ రాగ.. కలెక్షన్స్ పరంగా మాత్రం మంచి విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు తన తర్వాతి సినిమా ‘ మెకానిక్ రాకి ‘ సినిమా షూటింగ్లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. షూటింగ్ సెట్స్ పై ఉండగానే మరో సినిమా సంబంధించిన వివరాలని తాజాగా విశ్వక్ తెలిపారు.
CBI : ఫేక్ జాబ్స్ కేసులో సీబీఐ చర్యలు.. కానిస్టేబుల్ తో సహా 10మందిపై ఎఫ్ఐఆర్
విశ్వక్ సేన్ మరో కొత్త ప్రాజెక్టును తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ” లైలా ” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రామ్ నారాయణ దర్శకత్వంలో నటించేందుకు విశ్వక్ రెడీ అయిపోయాడు. ఇప్పుడు లైలా సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జులై 3 బుధవారం ఉదయం 9:30 గంటలకు నిర్వహిస్తున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. అయితే ఈ సినిమాలో విశ్వక్ రోల్ గురించి ఇంకా ఎటువంటి విశేషాలు తెలియ రాలేదు. షైన్ క్వీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి లైలా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గిబ్రాన్, తనిష్క్ బాగ్చి ఈ సినిమాకు సంగీత బాణాలను అందించబోతున్నారు. ఇక చిత్రంలోని మిగితా నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియ రాలేదు. రేపు జరగబోయే సినిమా పూజా కార్యక్రమంలో మిగతా విషయాలు తెలియవచ్చు.