బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ఇమ్రాన్ హష్మి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ విలన్‌గా చేసిన జర్నీ ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇమ్రాన్ హష్మీ తన కెరీర్ మొదట్లో కేవలం లవర్ బాయ్‌గా మాత్రమే కాకుండా, గ్రే షేడ్స్ ఉన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. మర్డర్ సినిమాతో ఆయనకు రొమాంటిక్ హీరో ఇమేజ్ వచ్చింది. ఆవారాపన్ సినిమా ఇమ్రాన్ హష్మీ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రం. హమారీ అధూరీ కహానీలో చాలా సాఫ్ట్ రోల్ చేసి మెప్పించాడు. కంగనా రనౌత్ ఇమ్రాన్ హష్మీ కాంబినేషన్లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ సినిమా మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయింది.
Also Read : Toxic : టాక్సిక్.. కియారా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన యష్
మొదట్లో రొమాంటిక్ సాంగ్స్ పాడుకునే హీరో కాస్తా, ఇప్పుడు భారీ యాక్షన్ సినిమాల్లో మెయిన్ విలన్‌గా కనిపిస్తున్నాడు. టైగర్ 3లో సల్మాన్‌ఖాన్‌ని సవాల్ చేసే మాజీ ISI ఏజెంట్‌గా ఇమ్రాన్ అద్భుతంగా నటించాడు. సాఫ్ట్ విలనిజంతో కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. దే కాల్ హిమ్ OGలో ఓమీగా పవన్ కళ్యాణ్‌తో తలపడే మెయిన్ విలన్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆతర్వాత తెలుగులో అడివిశేష్ హీరోగా వస్తోన్న గుడాచారి 2 మూవీలో కూడా ఇమ్రాన్ కీలక పాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మి తస్కరీ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ నీరజ్‌పాండే దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వచ్చే ఏడాది జనవరి 14నుండి స్ట్రీమింగ్ కానుంది. స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ కస్టమ్స్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఖాకీ ద బెంగాల్ ఫైల్స్ తర్వాత డైరెక్టర్ నీరజ్‌పాండే నుంచి వస్తోన్న వెబ్‌సిరీస్ కావడంతో తస్కరీపై ఓటీటీ ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కస్టమ్స్ ఆఫీసర్‌గా ఇమ్రాన్ హష్మి లుక్ వైరల్ అవుతోంది.