NTV Telugu Site icon

Viral news: 500 ఏళ్ల నాటి “ఏనుగు పాదం”గా పిచితే చింత చెట్టు..ఎక్కడ ఉందో తెలుసా?

Chinta Tree

Chinta Tree

అక్కడ “ఏనుగు పాదం” గా పిలవబడే ఒక ప్రత్యేకమైన చింత చెట్టు ఉంది. ఈ చెట్టు కాండం చాలా మందంగా ఉంటుంది. దానిపై ఏనుగు నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ చెట్టు సమీపంలో నివసించే మరియు ప్రయాణిస్తున్న ప్రజలకు నీడను అందిస్తుంది. మరోవైపు అనేక పక్షులు కూడా ఈ చెట్టు యొక్క మందపాటి ట్రంక్లో తమ గూళ్ళను ఏర్పాటు చేశాయి. ఇంత భారీ వృక్షం ఎక్కడుంటుందా అనుకుంటున్నారా..? మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని నగరంలోని రెవెన్యూ కాలనీ గిరిజన సంక్షేమ శాఖ ఎదురుగా ఈ చింతచెట్టు ఉంది. ఈ చెట్టు సుమారు 500 సంవత్సరాల నాటిది. ఈ చెట్టు ప్రత్యేకత దాని భారీ పరిమాణం.

READ MORE: Saranga Dariya: భారతీయుడు 2 రిలీజ్ రోజే రాజా రవీంద్ర ‘సారంగదరియా’

ఈ చెట్టు గురించి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ మదన్ మోహ్రే మాట్లాడుతూ.. ఈ రకమైన చింతచెట్లు ధార్ మరియు మాండవ్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయన్నారు. అయితే నగరంలో ఇంత పెద్ద చెట్టు ఇదొక్కటేనని చెప్పారు. ఈ చెట్టు నుంచి లభించే చింతపండును ఎక్కువగా ఆయుర్వేద చికిత్సకు ఉపయోగిస్తారని మదన్ మోహ్రే తెలిపారు. ఈ చెట్టులోని చింతపండును ముందుగా ఎండబెట్టి, ఆ తర్వాత దాని పొడిని ఉపయోగిస్తారని వెల్లడించారు. ఈ చెట్టు గురించి ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడగా.. కొన్నేళ్లుగా ఈ చెట్టును ఇలాగే చూస్తున్నామని చెప్పారు. ఇంతకుముందు అంతా బాగానే ఉండేదని.. కానీ ఇప్పుడు దానిని రక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిని కాపాడేందుకు అధికారులు దృష్టి సారించాలి.

Show comments