Warangal: వరంగల్ జిల్లాలోని కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో 18 ఏళ్ల బీహార్ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హతుడు దిల్కుష్ కుమార్ బీహార్ రాష్ట్రంలోని కగారియ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల సమాచారం మేరకు దిల్కుష్ కుమార్ ఎస్‌ఆర్‌ఆర్ తోట ప్రాంతంలో శవమై కనిపించగా, అక్కడే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.
Also Read: Loan App Harassment: లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక యువకుడి ప్రాణం బలి
స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందచేయగా, దాంతో వారు హత్యకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటన స్థానిక ప్రజలను తీవ్ర ఉద్రిక్తతకు గురి చేసింది. హతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఘ్తనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Drugs Seized: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్, గంజాయి, బంగారం పట్టివేత