Hyderabad: ముగ్గురూ.. స్నేహితులు ! పొట్టకూటి కోసం బీహార్ నుంచి హైదరాబాద్ వచ్చారు !! ముగ్గురూ ఒకేచోట పనిలో చేరారు. కలిసి పనిచేసుకుంటూ కుటుంబాలతో హ్యాపీగా ఉన్నారు. అన్యోన్యంగా ఉన్న వారి మధ్య అనుమాన భూతం చిచ్చు పెట్టింది. తన భార్యపై కన్నేశాడని తెలుసుకుని స్నేహితుడిని మందలించాడు..!! పలుమార్లు హెచ్చరించాడు..!! ఐనా తీరు మార్చుకోకపోవడంతో కక్షగట్టి దారుణంగా హతమార్చాడు. మృతదేహాన్ని మూసీ కాలువలో పడేశాడు. అంబర్‌పేట్‌లో జరిగిన ఈ మర్డర్ మిస్టరీని తెలివిగా చేధించారు పోలీసులు.
Murder : గత నెల 30 తేదీ జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసు ను బాలనగర్ పోలీసులు ఛేదించారు. ఏడుపాయల దగ్గర తాగిన మైకంలో స్నేహితున్ని కొట్టి చంపి ఆటోలో తీసుకు వచ్చి బాలానగర్ పరిధిలో ఖైతాన్ కంపెనీ రోడ్డు పక్కన చెత్తలో పడేసి పారిపోయారు. మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో గుర్తు…
Boy Kidnap : వికారాబాద్ జిల్లాలో డబ్బు కోసం ఏడాది బాలున్ని ఎత్తుకెళ్లిన గ్యాంగ్ మగపిల్లలు లేని వ్యక్తికి అమ్మేసి.. సొమ్ము చేసుకున్నారు. నిందితులు విక్రయించిన బాలున్ని స్వాదీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించడంతో తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ కథను కరణ్ కోట్ పోలీసులు సుఖాంతం చేశారు. తాండూరు రూరల్ సీఐ నగేష్ కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డితో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం చిత్తాపూర్ నుంచి…
Warangal: వరంగల్ జిల్లాలోని కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో 18 ఏళ్ల బీహార్ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హతుడు దిల్కుష్ కుమార్ బీహార్ రాష్ట్రంలోని కగారియ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల సమాచారం మేరకు దిల్కుష్ కుమార్ ఎస్‌ఆర్‌ఆర్ తోట ప్రాంతంలో శవమై కనిపించగా, అక్కడే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.…
Court Verdict : పంటలు సాగు చేయాల్సిన చోట గంజాయి మొక్కలు సాగు చేశాడు. పంటలు సాగు చేస్తే వచ్చే దిగుబడి అమ్మకాలకు పదో పరక వస్తుందని భావించిన మాసుల గౌస్ షోద్దీన్ గంజాయి మొక్కలను సాగు చేసి అమ్మకాలు చేపడితే లక్షలు గడించాలని ఆశపడి ఎక్సైజ్ పోలీసులకు గంజాయి మొక్కలతో గౌసోద్దీన్ పట్టుబడ్డాడు. ఐదేళ్లపాటు కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి చివరకు జిల్లా న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుకు బోరు మన్నాడు. మంగళవారం సంగారెడ్డి జిల్లా అడిషనల్…