NITI Aayog: నీతి ఆయోగ్ మీటింగ్ కు 9 మంది సీఎంలు డుమ్మా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాఖ్య స్ఫూర్తిని విస్మరించి విపక్ష పాలిత రాష్ర్టాలను వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సహా మరో ఎనిమిది మంది విపక్ష సీఎంలు బహిష్కరించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తమిళనాడు సీఎం స్టాలిన్ నీతి ఆయోగ్ భేటీకి గైర్హాజరయ్యారు.
Also Read : Raipur Crime: పెళ్లి సాకుతో మహిళా డాక్టర్ నుంచి 13 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి 9 మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టారు. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి హాజరు కాని ముఖ్యమంత్రులు ఎవరో మనం తెలుసుకుందాం..?
Also Read : Former died: ధ్యాన్యం కొనుగోలు కేంద్రంలో దారుణం.. నిద్రిస్తున్న రైతు పైనుంచి వెళ్లిన ట్రాక్టర్
నీతి ఆయోగ్ మీటింగ్ కు గైర్హాజరైనా సీఎంలు:
1. కేసీఆర్: కేజ్రీవాల్‌తో శనివారం హైదరాబాద్‌లో సమావేశం కావాల్సి ఉన్నందున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశానికి హాజరుకాలేదు.
2. అరవింద్ కేజ్రీవాల్: సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఢిల్లీలో కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ.. నీతి ఆయోగ్ మీటింగ్ కి హాజరవడం లేదని ప్రధాని మోదీకి లేఖ రాశారు.
3. భగవంత్ మాన్: పంజాబ్ రాష్ట్రానికి నిధుల మంజూరు విషయంలో కేంద్రం చూపుతున్న వివక్షకు నిరసనగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ దూరంగా ఉన్నారు.
4. మమతా బెనర్జీ: నీతి ఆయోగ్ సమావేశానికి తాను హాజరు కాకూడదని బెంగాల్ సీఎం ముందే నిర్ణయించుకున్నారు. ఆర్థిక మంత్రి, ప్రధాన కార్యదర్శిని పంపాలని టీఎంసీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది.
5. నితీష్ కుమార్: ముందుగా నిర్ణయించిన ప్రభుత్వ కార్యక్రమాల వల్ల నితీష్ కుమార్ హాజరు కాలేకపోతున్నారని బిహార్ మంత్రులు వెల్లడించారు.
6. అశోక్ గెహ్లాట్: అనారోగ్య కారణాలతో సీఎం గెహ్లాట్ సమావేశానికి హాజరు కావడం లేదని రాజస్థాన్ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
7. ఎం.కె స్టాలిన్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రస్తుతం సింగపూర్, జపాన్ పర్యటనలో ఉన్నారు. అందుకే ఆయన హాజరుకాలేదు.
8. పినరయి విజయన్: కేరళ సీఎం విజయన్ గైర్హాజరు కావడానికి ఎటువంటి నిర్దిష్ట కారణాలను మాత్రం వెల్లడించలేదు.
9. సిద్ధరామయ్య: కర్ణాటక రాష్ట్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలు ఉండటం వల్లే హాజరు కావడం లేదని సిద్ధరామయ్య ప్రభుత్వం తెలిపింది.
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!