Former died: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చివరి దశకు చేరుకోగా.. ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో రైతు నానా అవస్థలు పడుతున్నాడు. ఏటా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుండడం, గత కొన్నేళ్లుగా రైతు ఆందోళనలు సర్వసాధారణమైపోయాయి. దీంతో ఆది నుంచి పంటను కాపాడుకునేందుకు రైతు ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. పండిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వెళ్లేందుకు నానా కష్టాలు పడుతుంటే.. మార్కెట్ లో చేరుకుని మళ్లీ అంది అమ్మకునేందుకు మరిన్ని కష్టాలు పడే పరిస్థితి ఎర్పడుతుంది. పంటను అమ్మకునేందుకు కుటుంబానికి దూరంగా ఉంటూ పగలు రాత్రి అనే తేడాలేకుండా అక్కడు పంట అమ్ముకునేందుకు నానా కష్టాలపడతాడు. తను తెచ్చిన పంటపైనే సేదతీర్చుకుంటూ కడుపును మార్డుకుని కాలం గడుపుతుంటాడు. అయితే తన పండించిన పంటను కొనుగోలు కేంద్రంలో అమ్ముకునేందుకు వచ్చిన ఓ రైతుపై విధివక్రీకరించింది. కష్టపడి పండించిన పంటను కాపాడుకునేందుకు ఓ రైతు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు వచ్చిన ఓ రైతు ప్రమాదానికి గురయ్యాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో చోటుచేసుకుంది.
తిమ్మాపూర్ మండలం వర్ద్నూర్ గ్రామానికి చెందిన రైతు ఉప్లేటి మొండయ్య(65)కు వయోభారం వచ్చినా వ్యవసాయాన్ని వదల్లేదు. ఈ వయసులో కూడా చాలా కష్టపడి పంటలు పండించాడు. ఈసారి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు మొండయ్య తిమ్మూపూర్ కొనుగోలు కేంద్రానికి వెళ్లాడు. అయితే పంట అమ్మకపోవడంతో రాత్రి అక్కడే ఉండాల్సి వచ్చింది. కొనుగోలు కేంద్రంలోని ధాన్యం కుప్పకు కాపలాగా రైతు మొండయ్య రాత్రి అక్కడే నిద్రపోయాడు. ధాన్యం కుప్పపై టార్పాలిన్ చుట్టి ఉండడంతో నిద్రపోతున్న రైతు కనిపించలేదు. దీంతో తెల్లవారుజామున ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ నిద్రిస్తున్న రైతును ఢీకొట్టింది. ఈ క్రమంలో మొండయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కొనుగోలు కేంద్రంలో దాత మృతి చెందాడన్న సమాచారం అందుకున్న పోలీసులు ఐకేపీ కేంద్రానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైతు మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ధాన్యం పొదుపు చేసే క్రమంలో అన్నదాత మృతి చెందడం తిమ్మాపూర్ మండలంలో విషాదాన్ని నింపింది. మొండయ్య మృతితో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. మొండయ్య కోల్పోయిన తమకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.
Fake doctors: కడుపునొప్పని ఆస్పత్రికి పోతే.. మహిళ కిడ్నీలు, గర్భాశయాన్ని మాయం చేసిన డాక్టర్లు