9/11 Attacks: 2,976 మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడులు.. వెలుగులోకి సౌదీ మాజీ ఏజెంట్ షాకింగ్ వీడియోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
9/11 Attacks: అల్-ఖైదా ఉగ్రవాదులు అమెరికాపై జరిపిన 9/11 దాడుల వెనుక ఉన్న అసలు రహస్యాలు, దశాబ్దాలు గడుస్తున్నా విస్తుపోయేలా చేస్తూనే ఉన్నాయి. ఈ దాడులకు సంబంధించి సౌదీ అరేబియా ప్రభుత్వానికి చెందిన ఓ మాజీ నిందితుడు, అమెరికాను గజగజలాడించిన అల్-ఖైదా అగ్రనేత అన్వర్ అల్-అవ్లాకీతో కలసి ఉన్న సంచలనాత్మక వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. BBC జరిపిన ఓ పరిశోధన ద్వారా లభ్యమైన ఈ పాత వీడియో ఫుటేజ్, 9/11 బాధిత కుటుంబాలు సౌదీ ప్రభుత్వంపై వేసిన $1 ట్రిలియన్ డాలర్ల నష్టపరిహారం కేసులో ఇప్పుడు కీలక ఆధారంగా మారింది.
ఈ కథనంలో ప్రధాన వ్యక్తి ఒమర్ అల్-బయూమీ. ఇతను సౌదీ అరేబియా నిఘా విభాగానికి (స్పై) పనిచేస్తున్నాడనే అనుమానాలు సుదీర్ఘకాలంగా ఉన్నాయి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 1994లో సౌదీ నుంచి శాన్ డియాగో వచ్చిన బయూమీ, చదువును పక్కనపెట్టి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడమే పనిగా పెట్టుకున్నాడు. తాజాగా బయటపడిన 1997-98 కాలం నాటి ఫుటేజ్‌లో బయూమీ, అవ్లాకీతో పాటు సౌదీ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక అధికారి మిలిటరీ తరహా ‘పెయింట్ బాట్లింగ్’ రణరంగంలో పాల్గొంటూ కనిపించారు. రంగుల తుపాకులతో దాడులు చేసుకుంటూ, “అల్లాహు అక్బర్” అని నినాదాలు చేస్తూ వీరు పోరాట శిక్షణ పొందుతున్న ఈ దృశ్యాలు కేవలం ఒక ఆట కాదని, ఉగ్రవాద జిహాద్ కోసం తీసుకున్న శిక్షణ అని నాటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) విచారణలోనే వెల్లడైంది. అంతేకాకుండా, బయూమీ, అవ్లాకీలు ఆప్యాయంగా కౌగిలించుకున్న దృశ్యాలు, సౌదీ అధికారులతో బయూమీ జరిపిన రహస్య సమావేశాల దృశ్యాలు కూడా ఈ వీడియోల్లో ఉన్నాయి.
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
పెంటగన్‌పై దాడి చేసిన హైజాకర్లు నవాఫ్ అల్-హజ్మీ, ఖలీద్ అల్-మిహ్ధార్లకు బయూమీ బస ఏర్పాటు చేశాడనే ఆధారాలతో అతడిపై మొదటి నుంచీ అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే 9/11 దాడు జరిగిన పది రోజులకే, అంటే సెప్టెంబర్ 21, 2001న ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో బ్రిటీష్ పోలీసులు బయూమీని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో సోదాలు చేసినప్పుడు వేలకొద్దీ పత్రాలు, ఫొటోలు, 80 రికార్డెడ్ వీడియో టేపులతో పాటు ఓ డైరీ దొరికింది. ఆ డైరీలోని ఒక పేజీ అధికారుల మైండ్ బ్లాక్ చేసింది. అందులో ఒక విమానం బొమ్మతో పాటు, అది ఒక లక్ష్యాన్ని ఢీకొట్టడానికి ఎంత ఎత్తులో, ఎంత దూరంలో ఉండాలో వివరిస్తూ ఖచ్చితమైన గణిత లెక్కలు (మాథమెటికల్ క్యాలిక్యులేషన్స్) రాసి ఉన్నాయి. బాధిత కుటుంబాల లాయర్ జోడీ వెస్ట్‌బ్రూక్ ఫ్లవర్స్ మాటల్లో చెప్పాలంటే, ఇది దాడి ప్లాన్‌కు సంబంధించిన ఒక “స్మోకింగ్ గన్” వంటి తిరుగులేని ఆధారం.
అయితే, ఇంత పెద్ద సాక్ష్యం దొరికినా విచారణ ఎందుకు ముందుకు సాగలేదు? అనేదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. లండన్ పోలీస్ స్టేషన్లో ఈ ఆధారాలన్నీ మూలుగుతున్నప్పటికీ, శాన్ డియాగోలోని అమెరికా FBI అధికారులకు బ్రిటీష్ పోలీసులు వీటిని సరిగ్గా చేరవేయలేదు. 9/11 కమిషన్‌కు కూడా ఈ దస్త్రాలు అందకపోవడం గమనార్హం. ఒకవేళ ఈ ఆధారాలు తమకు ముందే అంది ఉంటే కేసును అతి త్వరగా ఛేదించేవాళ్లమని నాటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణాధికారి రిక్ లాంబెర్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. సౌదీ అధికారులను ప్రశ్నించడానికి అనుమతి కోరినప్పుడు, నిఘా వ్యవస్థలు తీవ్ర నిరోధాన్ని ఎదుర్కొన్నాయని మాజీ FBI అధికారి స్టీవ్ మూర్ తెలిపారు. బయూమీ దగ్గర దొరికిన ఆధారాలు అతడిని జైలుకు పంపడానికి సరిపోతాయని న్యాయశాఖ అధికారులు భావించినప్పటికీ, తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు, అధికారిక అడ్డంకుల వల్ల అతడిపై ఎలాంటి అభియోగాలు మోపలేకపోయారు. మొత్తంగా 2,976 మంది ప్రాణాలను బలిగొన్న 9/11 దాడుల్లో తమ పాత్ర ఏమాత్రం లేదని సౌదీ అరేబియా ఇప్పటికీ గట్టిగా ఖండిస్తోంది. అటు బయూమీ కూడా తాను అమాయకుడినని చెబుతున్నాడు. అయితే, న్యాయస్థానంలో సమర్పించిన ఈ కొత్త పత్రాలు, వీడియోలు మాత్రం 9/11 కుట్ర వెనుక సౌదీ అధికారుల నీడలు ఉన్నాయనే వాదనకు బలమైన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
తాజావార్తలు
-
9/11 Attacks: 2,976 మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడులు.. వెలుగులోకి సౌదీ మాజీ ఏజెంట్ షాకింగ్ వీడియోలు..
-
Dhanush Mythological Film: ధనుష్ కోసం రాజమౌళి తండ్రి రంగంలోకి.. భన్సాలీ సినిమాకు పౌరాణిక కథ!
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!