NTV Telugu Site icon

Pakistan: పాకిస్థాన్‌లో కుండపోత.. 86 మంది మృతి, 151 మందికి గాయాలు

Pakistan

Pakistan

Pakistan: పాకిస్థాన్‌లో ఎడతెరపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నగరాలు నీట మునుగుతున్నాయి. జూన్‌ 25 నుంచి కురుస్తున్న రుతుపవన వర్షాల కారణంగా దాదాపు 86 మంది మరణించగా.. 151 మంది గాయపడినట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌డీఎంఏ) నివేదించింది. గత 24 గంటల్లో పాకిస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆరుగురు మరణించారని, మరో తొమ్మిది మంది గాయపడ్డారని ఎన్‌డీఎంఏ తన నివేదికలో పేర్కొంది. ఎన్డీఎంఏ డేటా ప్రకారం, ఇప్పటివరకు, 86 మరణాలు, 151 గాయాలు నివేదించబడ్డాయి. ఇందులో 16 మంది మహిళలు, 37 మంది పిల్లలు ఉన్నారు. దేశవ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తుండటంతో 97 ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. పంజాబ్‌లో అత్యధికంగా భారీ వర్షాల వల్ల 52 మంది మరణించగా, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 20 మంది మరణించారు. బలూచిస్థాన్‌లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని ఎన్డీఎంఏ నివేదిక తెలిపింది.

Read: Article 370: ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌ ప్రశాంతం.. సుప్రీంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు

ఈ ఏడాది ఏప్రిల్‌లో పాకిస్తాన్‌లో వరదలు వినాశకరమయ్యే అవకాశం 72 శాతం ఉందని ఎన్డీఎంఏ అంచనా వేసింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC)కి ఇచ్చిన బ్రీఫింగ్‌లో ఎన్డీఎంఏ ఛైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ ఇనామ్ హైదర్ మాట్లాడుతూ.. ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయని, హిమానీనదం కరగడం, రుతుపవనాల ప్రారంభంలో వరదలు సంభవించవచ్చని నివేదించారు. ఎన్డీఎంఏ, పాకిస్తాన్ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ 17 ఉపగ్రహాలను పర్యవేక్షిస్తున్నాయని, 36 వరద ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఉంచినట్లు హైదర్ చెప్పారు. గత ఏడాది మాదిరిగానే ఇప్పుడు విపత్తు వరదలు సంభవించినట్లయితే పాకిస్థాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.

Also Read: PMAY: ఏడాది చివరి నాటికి పీఎం ఆవాస్‌ యోజన పూర్తి.. ఇప్పటికే 76 లక్షల ఇళ్లు పూర్తి

పాకిస్తాన్ పంజాబ్ అంతటా కొనసాగుతున్న వర్షాల కారణంగా లాహోర్‌లోని అజార్ టౌన్, షాహదారా టౌన్ పరిసరాల్లో రెండు పైకప్పులు కూలిపోయి కనీసం తొమ్మిది మంది గాయపడ్డారని పాకిస్తాన్ ఆధారిత డాన్ శనివారం నివేదించింది. రెస్క్యూ ఏజెన్సీ ప్రకారం, గణనీయమైన గాయాలు ఏవీ నివేదించబడలేదు. గాయపడిన వారందరినీ వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు నివేదిక తెలిపింది. పంజాబ్ రిలీఫ్ కమీషనర్ నబీల్ జావేద్ ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (పీడీఎంఏ) నియంత్రణ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ నదులకు వరదలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు.