NTV Telugu Site icon

Kakatiya University: కేయూలో ర్యాగింగ్ కలకలం.. మహిళా హాస్టళ్లలో జూనియర్లకు వేధింపులు.. 81 మందిపై వేటు

Ku

Ku

Ragging: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. వర్సిటీ మహిళా హాస్టల్ లో చాప కింద నీరులా ర్యాగింగ్ భూతం విస్తరిస్తోంది. జూనియర్ విద్యార్థినిలపై సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలతో ఏకంగా 81 మంది స్టూడెంట్స్ ను వర్సిటీ అధికారులు హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేశారు. మూడు రోజుల కిందట ఫ్రెండ్లి పరిచయాల పేరుతో తనను సీనియర్ విద్యార్థినులు ర్యాంగింగ్ చేశారని కామర్స్ విభాగానికి చెందిన ఓ విద్యార్థిని వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ర్యాగింగ్ భూతం వెలుగులోకి వచ్చింది.

Read Also: CM YS Jagan: సెంచురీ ప్లై వుడ్ పరిశ్రమ యూనిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్

తమను రాత్రివేళల్లో వర్సిటీ హాస్టల్స్ రూముల్లోకి పిలుచుకుని పరిచయం చేసుకోవాలని సీనియర్ విద్యార్థులు దురుసుగా మాట్లాడుతున్నట్టు విద్యార్థి నులు తెలిపారు. అంతే కాకుండా క్యాంపస్ లోని ఆడిటోరియం దగ్గరకు తమను బలవంతంగా పిలిపించారని, అక్కడ రైళ్లలో పల్లీలు అమ్ముకునే తీరును తమకు చూపాలని, పాటలు పాడాలని, డ్యాన్స్ లు చేయాలని వేధింపులకు గురిచేసినట్లు జూనియర్ విద్యార్థినిలు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వర్సిటీ హాస్టల్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ వై. వెంకయ్య విచారణ నిర్వహించి మూడు రోజుల్లో వరుసగా 81 మంది విద్యార్థినులను వారం పాటు హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో జువాలజీ విభాగంలో 25 మంది, కామర్స్, ఎకానమిక్స్ విభాగాల్లో 28 మంది చొప్పున ఉన్నారు.

Read Also: Bank Holidays: జనవరిలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసా?

కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ జరగలేదని పరిచయ వేదిక కార్యక్రమం పేరుతో జూనియర్లను సీనియర్లు పిలిచి మాట్లాడిన అంశాన్ని సీరియస్ గా తీసుకొని ముందు జాగ్రత్తగా విద్యార్థులకు హెచ్చరిక లాగా ఉండేందుకు సీనియర్లపై చర్యలు తీసుకున్నామని కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేష్ తెలిపారు. హాస్టల్ డైరెక్టర్ సమక్షంలో పరిచయ కార్యక్రమం పూర్తైన తర్వాత మరోసారి హాస్టల్లో పరిచయ కార్యక్రమాన్ని పెట్టుకున్న తీరును యాంటీ లాగిన్ కమిటీ నిర్ధారణ చేయడంతో ఐదు రోజుల పాటు హాస్టల్ నుంచి డిపార్ట్మెంట్లకు సంబంధించిన 81 మందిని సస్పెండ్ చేశామని వర్సిటీ వీసీ రమేష్ వెల్లడించారు.