NTV Telugu Site icon

YouTube: యూట్యూట్ లో తప్పుడు వార్తల ప్రసారం.. 8 ఛానళ్లపై కేంద్రం వేటు

Youtube

Youtube

ముందస్తు లోక్‌సభ ఎన్నికలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను నిషేధించడం వంటి తప్పుడు వార్తలను ప్రసారం చేసినందుకు గాను 8 యూట్యూబ్ ఛానళ్లను (23 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు) కేంద్ర ప్రభుత్వం నిషేదిస్తున్నట్లు తెలిపింది. ఆ ఛానళ్లలో యహాన్ సచ్ దేఖో, క్యాపిటల్ టీవీ, కేపీఎస్ న్యూస్, సర్కారీ వ్లాగ్, ఎర్న్ టెక్ ఇండియా, వరల్డ్ బెస్ట్ న్యూస్ ఛానల్, ఎస్‌పీఎన్ 9 న్యూస్, ఎడ్యుకేషనల్ దోస్త్ ఇందులో ఉన్నాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మెంబర్స్, ఆ ఛానళ్లకు సంబంధిం వివరాలను సేకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: PK MB: మహేశ్ బాబుకి స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్పిన పవర్ స్టార్…

వరల్డ్ బెస్ట్ న్యూస్ భారత సైన్యాన్ని కించపరుస్తూ.. సైన్యాన్ని తక్కవ చేసి చూపించారని అధికారులు వెల్లడించారు. ఇక, ఎడ్యుకేషనల్ దోస్త్ అనే ఛానల్ ప్రభుత్వ పథకాల గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మెంబర్స్ నిర్ధారించారు. SPN9 ఛానల్ రాష్ట్రపతి, ప్రధాన మంత్రితో పాటు పలువురికి సంబంధించిన ఫేక్ వార్తలను ప్రచురించింది.

Read Also: Jangon Crime: కూతురి వేలు కొరకిన అల్లుడు.. ఇంట్లోనే సమాధి కట్టిన మామ..!

అదేవిధంగా సర్కారీ వ్లాగ్ ఛానల్ ప్రభుత్వ పథకాలపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక, కేపీఎస్ న్యూస్ అనే ఛానల్‌ రూ.20కి వంటగ్యాస్ సిలిండర్లు, లీటరుకు రూ.15కు పెట్రోలు లభిస్తుందంటూ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, ఆర్డర్లు, నిర్ణయాలకు సంబంధించి ఫేక్ న్యూస్ ప్రచారం చేసిందని అధికారుల విచారణలో వెల్లడైంది.

Read Also: Prabhas: 50 రోజుల్లో రికార్డులని చెల్లాచెదురు చేయడానికి ‘డైనోసర్’ వస్తుంది

అయితే, క్యాపిటల్ టీవీ ఛానల్ ప్రధాని, కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన అమలుకు సంబంధించిన ఉత్తర్వుల గురించి అసత్యపు న్యూస్ ను ప్రచారం చేసిందని తేలింది. యహన్ సచ్ దేఖో ఛానల్ ఎన్నికల సంఘం, భారత ప్రధాన న్యాయమూర్తికి సంబంధించిన ఫేక్ న్యూస్ ను టెలికాస్ట్ చేసిందని అధికారులు గుర్తించారు. చివరగా ఎర్న్ ఇండియా టెక్ ఛానల్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇతర సేవలకు సంబంధించి నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారుల ఎంక్వైరీలో తేలింది.