మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఫణీంద్ర నరిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘ఎనిమిది వసంతాలు’ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అనంతిక తెలుగు డెబ్యూ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి డైరెక్టర్ కాన్ఫిడెన్స్, ప్రమోషన్ కంటెంట్ చూసి సినిమా ఏదో గట్టిగానే వర్కౌట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే, ఈ సినిమా దర్శకుడు మాత్రం సినిమా అద్భుతంగా ఉందని, నచ్చని వాళ్ల గురించి తనకు తెలియదని అంటూ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ‘ఎనిమిది వసంతాలు’ కాదని, ఏకంగా 12 వసంతాలు ఉన్నాయని, కానీ సినిమాలో అంతా చూపించలేని కారణంగా ఎనిమిది వసంతాలతో కథను రాసి క్లోజ్ చేశానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా 8 వసంతాలు సినిమా ఓటీటీలోకి రావడంతో, త్వరలోనే తాను 12 వసంతాల స్క్రిప్ట్‌ను పీడీఎఫ్ రూపంలో పెడతానని ఆయన పేర్కొన్నారు. 12 వసంతాలతో పోలిస్తే, ‘ఎనిమిది వసంతాలు’లో శుద్ధి అయోధ్య పెద్దగా కష్టపడలేదని చెప్పుకొచ్చారు. వారణాసి ఎపిసోడ్‌లలో వరుణ్, సోదరి, ఇష్టకుమార్, రాము, మమత లాంటి క్యారెక్టర్‌లను నిడివి కారణంగా తొలగించానని, అలాగే సెకండ్ హాఫ్‌లో శుద్ధి అయోధ్యను చాలా ఇబ్బంది పెట్టానని, ఒక రకంగా ఆమెను బూడిద స్థాయికి తీసుకెళ్లానని కామెంట్స్ చేశారు.
Also Read: Pulasa Fish: యానాంలో చిక్కిన పులస.. వేలంలో తీవ్ర పోటీ, కేజీకి ఊహించని ధర!
ఆమెకు యాక్సిడెంట్ చేసి, పక్కటెముకలు విరిగేలా రాసానని, క్యాన్సర్ వచ్చేలా కథను రాసుకున్నానని, ఆ తర్వాత ఆమె జాగ్రత్తగా బౌన్స్ బ్యాక్ అయినట్టు కూడా రాసుకున్నట్లు చెప్పుకొచ్చారు. సెకండ్ హాఫ్‌లో మరోసారి వరుణ్‌తో ఎన్‌కౌంటర్ అయ్యాక, ఆమె మాట్లాడే ఒక్కో మాట ఒక్కో తూటాలా పేలేలా రాసుకున్నానని, కానీ నిడివి కారణంగా అవేవీ షూట్ చేయలేకపోయినట్లు ఫణీంద్ర పేర్కొన్నారు. అయితే, ఫణీంద్ర రాసిన పోస్ట్‌పై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇప్పట్లో ఇతను ఈ సినిమాని వదిలేలా లేడని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఒక కథ రాసుకున్న రచయితకు దానిపై ఉన్న ప్రేమ అలాంటిదని కామెంట్ చేస్తున్నారు.