Pulasa Fish: యానాంలో చిక్కిన పులస.. వేలంలో తీవ్ర పోటీ, కేజీకి ఊహించని ధర!
- మొదలైన పులసల సందడి
- యానాంలో చిక్కిన పులస చేప
- పులస కోసం వేలంలో తీవ్ర పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పుస్తెలు అమ్మైనా సరే.. పులస తినాలి’ అనే నానుడి గోదావరి జిల్లాలో బాగా విపిస్తుంటుంది. ‘పులస’ చేప దొరకడం చాలా అరుదు కాబట్టే.. జీవితంలో ఒక్కసారైనా పులసను తినాలని భావిస్తుంటారు. నదీ ప్రవాహానికి అతి వేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. అంతేకాదు ఈ చేప ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. అందుకే వేలంలో ఎంత ధర పెట్టడానికైనా జనాలు వెనుకాడరు. ఇప్పటికే ఎన్నో పులస చేపలు రికార్డు ధరలో అమ్ముడుపోయాయి.
Also Read: Lords Test: జేమీ స్మిత్ సరికొత్త చరిత్ర.. టెస్టుల్లో తొలి బ్యాటర్‌గా..!
Also Read
- Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
- Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
- BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
- Maharashtra: "ఇది కదా విశ్వాసం అంటే".. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
గోదావరి నదికి వరదలు వచ్చే సమయంలో పులస చేపల సీజన్ ఆరంభం అవుతుంది. ఈ ఏడాది కూడా గోదావరికి వరద నీటి తాకిడి పెరిగింది. దాంతో పులస చేపల సీజన్ మొదలైంది. ఎర్ర నీరు ఉదృతంగా రావడంతో పులసలు ఎదురీదుతూ వస్తున్నాయి. ఇప్పటికే గోదావరి తీరానికి సమీపంలో ఉండే యానాం ప్రాంతంలో తొలి పులస చేప చిక్కింది. మూడు రోజుల క్రితం యానాం ఫిష్ మార్కెట్‌లో పులస రూ.4000 ధర పలికింది. ఈరోజు మరో పులస చేప మత్స్యకారులకు దొరికింది. పులస ప్రియలు వేలంలో పోటీ పడ్డారు. దాంతో కేజీ ధర రూ.15000 పలికింది. యానాంలో పులసల సందడి మొదలవడంతో మత్స్యకారుల పంట పండుతోంది.
తాజావార్తలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
-
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!