Good News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న డీఏ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Good News: డీఏ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త విన్పించనుంది. త్వరలో డీఏను మరోసారి 4 శాతం పెంచవచ్చని తెలుస్తోంది. అంటే ఇప్పుడు అందుతున్న 38 శాతం డీఏకు అదనంగా మరో 4 శాతం చేరి..42 శాతం కానుంది. ప్రతి నెలా జారీ అయ్యే సీపీఐ సూచీ ప్రకారం అంటే వినియోగదారుల సూచీ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులకు కరవుభత్యం పెరుగుతుంటుంది. కేంద్ర కార్మిక శాఖ ఈ సూచీని విడుదల చేస్తుంటుంది. గత ఏడాది అంటే 2022 డిసెంబర్ నెల సూచీ ప్రకారం 4.3 శాతం డీఏ లెక్క వేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈసారి డీఏను 4 శాతం పెంచవచ్చని అంచనా ఉంది.
రాబడిని పరిగణనలో తీసుకుని డీఏ పెంపు ప్రతిపాదనను కేంద్ర ఆర్ధిక శాఖ..కేబినెట్ ఆమోదానికి పంపిస్తుంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు 38 శాతం డీఏ తీసుకుంటున్నారు. బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో, ఉద్యోగుల డీఏ అలవెన్స్‌పై ఆమోద ముద్ర పడవచ్చు. దానితో పాటు పెరిగిన డీఏను కూడా ప్రకటించవచ్చు. అందువల్ల మార్చి నెల జీతంలో క్రమంగా పెరుగుదల ఉంటుంది. కేంద్ర ఉద్యోగుల జీతం రూ.27312 మేర పెరిగే అవకాశం ఉందని వర్గాల సమాచారం. మార్చి 1న మంత్రివర్గం సమావేశం కానుంది. డీఏకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత డియర్నెస్ అలవెన్స్‌లో భారీగా పెంపుదల ఉంటుంది. ఉద్యోగి ఖాతాలో పెద్ద మొత్తం జమ అవుతుంది. అలాగే ఉద్యోగులకు జనవరి, ఫిబ్రవరి నెలల బకాయిలు అందుతాయి. డీఏను 4 శాతం పెంచడం వల్ల ఉద్యోగుల జీతం నెలకు రూ.720 నుంచి రూ.2276కి భారీ ప్రయోజనం చేకూరుతుంది.
Also Read
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
- Ajinkya Rahane: "ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే".. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
- Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
Read Also: Anand Mahindra: కలిసి పనిచేద్దాం.. బిల్ గేట్స్‌తో ఆనంద్ మహీంద్రా
ఒక ఉద్యోగి మూల వేతనం రూ.18000 అయితే అతని జీతం నెలకు రూ.720 పెరుగుతుంది. ఉద్యోగి జీతం ఏడాదికి మొత్తం రూ.8640 పెరుగుతుంది. కాబట్టి ఒక ఉద్యోగి మూల వేతనం నెలకు రూ. 56900 అయితే, అతని జీతంలో నెలకు రూ. 2276 ప్రయోజనం పొందుతారు. ఉద్యోగి జీతం ఏడాదికి మొత్తం రూ.27312 పెరుగుతుంది.
Read Also: Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ @50.. బర్త్ డే గిఫ్ట్‌గా భారీ విగ్రహం
ఉద్యోగుల డీఏ 4 శాతం పెరిగితే అది ప్రస్తుతమున్న దానితో కలుపుకుంటే 42 శాతానికి చేరుతుంది. అయితే జూలై 2022లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏను 4 శాతం పెంచింది. డీఏ, డీఆర్‌ల పెంపుదల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిస్సహాయంగా మారింది. ఇప్పటి వరకు కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ పథకం ఖజానాకు గండి కొట్టడమేనన్నారు. కానీ ఇప్పుడు స్వరం కాస్త మెత్తబడింది. కొత్త పింఛను పథకంపై ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసం ఈ కొత్త పథకంలో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్త పెన్షన్ స్కీమ్‌ను సంస్కరించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు కచ్చితమైన వార్తలు వచ్చాయి.
తాజావార్తలు
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!