77th IPS Batch: 77వ బ్యాచ్ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్.. ముఖ్యఅతిథిగా బీఎస్ఎఫ్ డైరెక్టర్!
- 77వ బ్యాచ్ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్
- ముఖ్యఅతిథిగా బీఎస్ఎఫ్ డైరెక్టర్
- ట్రైనీ ఐపీఎస్‌లకు అవార్డులు, రివార్డులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 77వ బ్యాచ్ ఐపీఎస్‌లకు శిక్షణ పూర్తయింది. శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు పూర్తయింది. పాసింగ్ అవుట్ పరేడ్‌కు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్‌సింగ్ చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఐపీఎస్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. బెస్ట్ అర్చివర్స్, ప్రతిభ కనబరిచిన ట్రైనీ ఐపీఎస్‌లకు అవార్డులు, రివార్డులు అందించారు.
పరేడ్ కమాండర్‌గా శిక్షణ ఐపీఎస్ అంజిత్ ఏ నాయర్ వ్యవహరించారు. 49 వారల పాటు కఠిన శిక్షణ టెక్నికల్, నాన్ టెక్నీకల్ ఇండోర్ అండ్ ఔట్ డోర్ ఐపీఎస్‌ల శిక్షణ పూర్తయింది. 190 మంది ఆఫీసర్లకు హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ ఇటీవలే పూర్తయింది. ఇందులో 174 ఐపీఎస్ ఆఫీసర్లు, 16 మంది ఇతర దేశాలకు చెందిన ఆఫీసర్లు ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 62 మంది మహిళా ఆఫీసర్లు, 112 మంది పురుష ఐపీఎస్‌లు ఉన్నారు. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారిలో ఇంజనీరింగ్ చదివిన వారు (87 మంది) 50 శాతం మంది ఉన్నారు. ఆర్ట్స్ విభాగానికి చెందిన వారు 29 మంది, ఎంబీబీఎస్ 8, లా చదివిన వారు ఆరుగురు, సైన్స్ విభాగానికి చెందినవారు 36 మంది ఉన్నారు.
Also Read
- 3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
- Saudi Arabia: ఎర్ర సముద్రంలో రాజుకున్న మంటలు.. సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై క్షిపణుల వర్షం!
- డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
- Sri Hari Stotram: తొలి ఏకాదశి వేళ భక్తి టీవీలో అమృతతుల్యమైన "శ్రీహరి స్తోత్రం".. తప్పక వినండి!
శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లలో తెలంగాణకు నలుగురు, ఏపీకి నలుగురిని కేటాయించారు. తెలంగాణకు ఇద్దరు మహిళా ఐపీఎస్‌లు, ఏపీకి ఒక మహిళ ఐపీఎస్ కేటాయించారు. 77 బ్యాచ్‌లో అత్యధికంగా 36.63 (62 మంది) శాతం మహిళలు ఉన్నారు. 77వ ఐపీఎస్ బ్యాచ్ శిక్షణలో 25 సంవత్సరాలు వయసు లోపు ఉన్నవారు 21 మంది ఉన్నారు. 25 ఏళ్ల వయసులోపు ఉన్నవారిలో ఏడుగురు మహిళలు, 14 మంది పురుష ఐపీఎస్‌లు ఉన్నారు. ఇప్పటివరకు సర్దార్ వల్లభాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో 6476 మంది ఐపీఎస్‌లకు శిక్షణ ఇచ్చారు. ఇందులో 380 మంది ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు.
తాజావార్తలు
-
Maharashtra TET Paper Leak Case: టెట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. ప్రధాన నిందితుడు అరెస్టు
-
Uyir OTT Release: రియల్ పోలీస్ రాసిన కథ.. ఓటీటీలోకి వస్తున్న మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఉయిర్’!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
Saudi Arabia: ఎర్ర సముద్రంలో రాజుకున్న మంటలు.. సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై క్షిపణుల వర్షం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!