Site icon NTV Telugu

China Corona: ఆ నగరంలో 70శాతం మందికి కోవిడ్.. బాధితులతో కిక్కిరిసిన ఆస్పత్రులు

Shangai

Shangai

China Corona: ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడుతాడు అన్న సామెత గుర్తుందిగా.. ఇప్పుడు చైనా పరిస్థితి అదే. తాను కనిపెట్టిన మహమ్మారి కరోనా వైరస్ ఆ దేశాన్ని వదలట్లేదు. వదిలిందనుకున్న ప్రతీసారి తన రూపాన్ని మార్చుకుని విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఆ దేశంలోని షాంఘై నగరంలో ప్రస్తుతం కోవిడ్ రోగులతో నిండిపోతున్నాయి. ఆ నగరంలో దాదాపు 70శాతం మందికి కరోనా వైరస్ వ్యాపించి ఉంటుందని సీనియర్ డాక్టర్ ఒకరు అభిప్రాయపడ్డారు.

Read Also: Free Condoms : కోరికలు ఆపుకోకండి.. కండోమ్స్ ఫ్రీగా తీసుకోండి

డిసెంబర్ నెలలో చైనా ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను సడలించిన తర్వాత కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. ఇటు పాజిటివ్ కేసులతో పాటు.. అదే రీతిలో మరణాల సంఖ్య పెరుగుతూ పోతుంది. దీంతో ఇటు బాధితులతో హాస్పిట‌ళ్లు, మృతదేహాలతో శ్మశానవాటికలు కిక్కిరిసిపోతున్నాయి. రుయిజిన్ హాస్పిట‌ల్ వైస్ ప్రెసిడెంట్‌, షాంఘై కోవిడ్ అడ్వైజ‌రీ ప్యానెల్ నిపుణుడు చెన్ ఎర్జన్ దీనిపై మాట్లాడారు. షాంఘైలో ఉన్న 2.5 కోట్ల మంది ప్రజ‌ల్లో.. చాలా మందికి వైర‌స్ సోకి ఉంటుంద‌న్నారు. ఆ న‌గ‌రంలో ప్రస్తుతం వైర‌స్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంద‌ని, జ‌నాభాలో 70 శాతం మందికి ఆ వైర‌స్ సోకి ఉంటుంద‌ని, గ‌త ఏప్రిల్‌, మే నెల‌ల‌తో పోలిస్తే అది 20 నుంచి 30 శాతం అధికంగా ఉంటుంద‌న్నారు.

Read Also: Good News for Drinkers : మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యంపై పన్ను రద్దు

2022 ఏప్రిల్‌లో షాంఘైలో క‌ఠిన లాక్‌డౌన్ అమ‌లు చేశారు. ఆ స‌మ‌యంలో సుమారు ఆరు ల‌క్షల మందికి వైర‌స్ సోకింది. భారీ స్థాయిలో క్వారెంటైన్ సెంట‌ర్లలో వాళ్లను లాక్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం మ‌ళ్లీ ఒమిక్రాన్ బీఎఫ్7 పంజా విసురుతోంది. న‌గ‌రంలో ఆ వేరియంట్ జోరుగా వ్యాపిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ఆ ఇన్‌ఫెక్షన్లు అధికంగా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. బీజింగ్‌, తియాంజిన్‌, చాంగ్‌కింగ్‌, గాంగ్‌జూ లాంటి న‌గ‌రాల్లో ఇప్పటికే కోవిడ్ కేసులు తారా స్థాయికి చేరుకున్నాయి. రుయిజిన్ హాస్పిట‌ల్‌లో ప్రతి రోజు 1600 ఎమ‌ర్జెన్సీ అడ్మిష‌న్లు జ‌రుగుతున్నట్లు చెన్ ఎర్జన్ తెలిపారు. 65 ఏళ్లు దాటిన వారంతా ఎమ‌ర్జెన్సీ విభాగంలో జాయిన్ అవుతున్నట్లు తెలిపారు.

Exit mobile version