China Corona: ఆ నగరంలో 70శాతం మందికి కోవిడ్.. బాధితులతో కిక్కిరిసిన ఆస్పత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Corona: ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడుతాడు అన్న సామెత గుర్తుందిగా.. ఇప్పుడు చైనా పరిస్థితి అదే. తాను కనిపెట్టిన మహమ్మారి కరోనా వైరస్ ఆ దేశాన్ని వదలట్లేదు. వదిలిందనుకున్న ప్రతీసారి తన రూపాన్ని మార్చుకుని విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఆ దేశంలోని షాంఘై నగరంలో ప్రస్తుతం కోవిడ్ రోగులతో నిండిపోతున్నాయి. ఆ నగరంలో దాదాపు 70శాతం మందికి కరోనా వైరస్ వ్యాపించి ఉంటుందని సీనియర్ డాక్టర్ ఒకరు అభిప్రాయపడ్డారు.
Read Also: Free Condoms : కోరికలు ఆపుకోకండి.. కండోమ్స్ ఫ్రీగా తీసుకోండి
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
డిసెంబర్ నెలలో చైనా ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను సడలించిన తర్వాత కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. ఇటు పాజిటివ్ కేసులతో పాటు.. అదే రీతిలో మరణాల సంఖ్య పెరుగుతూ పోతుంది. దీంతో ఇటు బాధితులతో హాస్పిటళ్లు, మృతదేహాలతో శ్మశానవాటికలు కిక్కిరిసిపోతున్నాయి. రుయిజిన్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్, షాంఘై కోవిడ్ అడ్వైజరీ ప్యానెల్ నిపుణుడు చెన్ ఎర్జన్ దీనిపై మాట్లాడారు. షాంఘైలో ఉన్న 2.5 కోట్ల మంది ప్రజల్లో.. చాలా మందికి వైరస్ సోకి ఉంటుందన్నారు. ఆ నగరంలో ప్రస్తుతం వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని, జనాభాలో 70 శాతం మందికి ఆ వైరస్ సోకి ఉంటుందని, గత ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే అది 20 నుంచి 30 శాతం అధికంగా ఉంటుందన్నారు.
Read Also: Good News for Drinkers : మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యంపై పన్ను రద్దు
2022 ఏప్రిల్‌లో షాంఘైలో కఠిన లాక్‌డౌన్ అమలు చేశారు. ఆ సమయంలో సుమారు ఆరు లక్షల మందికి వైరస్ సోకింది. భారీ స్థాయిలో క్వారెంటైన్ సెంటర్లలో వాళ్లను లాక్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం మళ్లీ ఒమిక్రాన్ బీఎఫ్7 పంజా విసురుతోంది. నగరంలో ఆ వేరియంట్ జోరుగా వ్యాపిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ఆ ఇన్‌ఫెక్షన్లు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బీజింగ్, తియాంజిన్, చాంగ్‌కింగ్, గాంగ్‌జూ లాంటి నగరాల్లో ఇప్పటికే కోవిడ్ కేసులు తారా స్థాయికి చేరుకున్నాయి. రుయిజిన్ హాస్పిటల్‌లో ప్రతి రోజు 1600 ఎమర్జెన్సీ అడ్మిషన్లు జరుగుతున్నట్లు చెన్ ఎర్జన్ తెలిపారు. 65 ఏళ్లు దాటిన వారంతా ఎమర్జెన్సీ విభాగంలో జాయిన్ అవుతున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!