7/G Brundavan Colony Sequel : షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
7/G బృందావన కాలనీ.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2004లో తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయ్యి.. రెండు భాషల్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్ లుగా నటించారు. వారిద్దరి కెరీర్ లో 7/G బృందావన్ కాలనీ ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోయింది. ఈమూవీ తమిళంలో 7/G రెయిన్‌బో కాలనీ టైటిల్‌తో విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో యూత్ కి తెగ నచ్చేసింది. ఇప్పటికీ ఈ సినిమా ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఈ సినిమాను డైరెక్టర్ సెల్వ రాఘవన్ అద్భుతంగా తెరకెక్కించారు.ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ చాలా పాపులర్..అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 22న మరోసారి థియేటర్స్ లో రీ రీలిజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి రీ రిలీజ్ లో ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇంకో ఆసక్తి కర విషయం ఏమిటంటే ఈమూవీకి సీక్వెల్ అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఈమూవీ సీక్వెల్ షూటింగ్ పై ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ ఆల్‌టైమ్ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్టు నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చేశారు. అయితే మూవీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అనేది మాత్రం గతంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈక్రమంలో ఇప్పుడు ఈ క్రేజీ సినిమా సీక్వెల్ న్యూస్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతుంది.తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ సెప్టెంబర్ మొదటివారం నుంచి మొదలు అవ్వనున్నట్లు సమాచారం. ఈ సీక్వెల్‌కు కుడా సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తుంది.. లవ్ టుడే ఫేం ఇవానా మరియు అదితి శంకర్ పేర్లు ఫీ మేల్ లీడ్ రోల్ కోసం తీసుకోనున్నట్లు సమాచారం అయితే ఈసీక్వెల్‌లో మరోసారి రవికృష్ణ హీరోగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. సెల్వరాఘవన్ ఈమూవీని మరింత డిఫరెంట్ గా ప్లాన్ చేశాడని సమాచారం.నిర్మాత ఏఎం రత్నం త్వరలోనే ఈ సీక్వెల్ కు సంబంధించి ఇతర వివరాలపై క్లారిటీ ఇవ్వనున్నట్టు సమాచారం..
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!