NTV Telugu Site icon

Telangana: లోక్‌సభ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం.. ఎంతంటే?

Ts Loksabha

Ts Loksabha

తెలంగాణలో సోమవారం లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అయితే.. వేసవి ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు ఓటువేసేందుకు ముందుకు వచ్చారు. అక్కడక్కడా చెదురు ముదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఓటర్లు ఉత్సాహంగా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Andhra Pradesh Election 2024: సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఏపీ ఎలెక్షన్స్.. ప్రతి సీనూ క్లైమాక్సే!

అయితే.. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో 65.67 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా భువనగిరి 76.78 శాతం, అత్యల్పంగా.. హైదరాబాద్ 48.48 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు. తెలంగాణలో 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2019లో రాష్ట్రంలో 62.77 శాతం ఓటింగ్ నమోదైంది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గంలో 50.34% ఓటింగ్ నమోదైంది.

DC vs LSG: లక్నో ముందు భారీ లక్ష్యం.. ఢిల్లీ స్కోరు ఎంతంటే..?

17 నియోజకవర్గాల్లో జరిగిన ఓటింగ్ శాతం..
ఆదిలాబాద్‌ 74.03 శాతం, పెద్దపల్లి 67.87, కరీంనగర్ 72.54 శాతం, నిజామాబాద్‌ 71.92, జహీరాబాద్‌ 74.63, మెదక్‌ 75.09, మల్కాజ్‌గిరి 50.78, సికింద్రాబాద్‌ 49.04, చేవెళ్ల 56.50, మహబూబ్‌నగర్ 72.43, నాగర్‌కర్నూల్ 69.46 శాతం, భువనగిరి 76.78 శాతం, నల్గొండ 74.02, హైదరాబాద్ 48.48 శాతం, వరంగల్‌ 68.86 శాతం, మహబూబాబాద్‌ 71.85, ఖమ్మం 76.09 శాతం పోలింగ్ నమోదు.