Russo-Ukrainian War : ప్రతీకారం తీర్చుకున్న ఉక్రెయిన్.. 63మంది రష్యన్ సైనికులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russo-Ukrainian War : గదిలో వేసి కొడితే పిల్లి కాస్త పులవుతుందని సామెత ఇప్పుడు ఉక్రెయిన్ దేశానికి సరిగ్గా సరిపోతుంది. చిన్న దేశాన్ని చేసి ఏడాదిగా రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తోనే ఉంది. రష్యా చేస్తున్న దాడులకు ఉక్రెయిన్ దేశం చిన్నాభిన్నం అయింది. అయినా ఆ దేశం కిందకు వెళ్లేది లేదని.. చివరి వరకు పోరాడుతామని ఉక్రెయిన్ అంటోంది. దాయాది దేశాల మద్దతుతో రష్యాతో పోరాడుతోనే ఉంది. ఈ క్రమంలో రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకుంటుంది. గత వారం రోజులుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య దాడులు తీవ్రరూపం దాల్చాయి. రష్యా డొనెట్స్క్‌పై ఉక్రెయిన్ క్షిపణులతో దాడి చేసింది. ఉక్రెయిన్ క్షిపణి దాడిలో 63 మంది సైనికులు మరణించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంతకుముందు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తన క్షిపణి దాడిలో సుమారు 400 మంది రష్యన్ సైనికులు మరణించినట్లు ప్రకటించింది.
Read Also: Virovore : వైరస్‌లను తినే జీవి వైరోవోర్.. శాస్త్రవేత్తల ఆవిష్కరణ
Also Read
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
- Bangladesh: బంగ్లాదేశ్‌లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
రష్యా సైన్యం ఆక్రమించిన తూర్పు ఉక్రెయిన్‌లోని ఓ పాఠశాలపై ఉక్రెయిన్ దాడి చేసింది. న్యూ ఇయర్ రోజు ఈ దాడి జరిగింది. ఉక్రెయిన్ నాలుగు రాకెట్లతో దాడి చేసిందని, అందులో తమ సైనికులు మరణించారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం (జనవరి 1) ఉక్రెయిన్ సైన్యం నూతన సంవత్సర పండుగ సందర్భంగా మాస్కో డొనెట్స్క్‌పై కనీసం 25 రాకెట్లను ప్రయోగించింది. నూతన సంవత్సరం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన కొద్ది సేపటి తర్వాత ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో రష్యా సైనికులు బస చేసిన స్థావరం పక్కనే భారీ మందుగుండు నిల్వ కేంద్రం ఉండటంతో రాకెట్ దాడివల్ల అన్ని సైనిక పరికరాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ సమయంలో ఇరు దేశాల మధ్య పోరు మరింత ముదిరింది. అంతకుముందు.. రష్యా గత వారం ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్‌లతో దాడి చేసింది. రష్యా దాడిలో దాదాపు నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
-
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
-
Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు చెప్పుకోలేని బాధ ఇదే! శరీరం కోలుకున్నా మనసు ఎందుకు కోలుకోదు?
-
Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
-
Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!