NTV Telugu Site icon

Drug Smuggler: కడుపులో 63 డ్రగ్స్ క్యాప్సూల్స్.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో పట్టుబడ్డ స్మగ్లర్

Drugs Smuggler

Drugs Smuggler

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాంజానియాకు చెందిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీసుకెళ్తున్నాడనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఆ వ్యక్తిని అధికారులు విచారించగా.. కొకైన్ క్యాప్సూల్స్ మింగినట్లు బయటపడింది. దీంతో.. అతనికి వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడు. క్యాప్సూల్స్‌లో నింపిన మందు విలువను లెక్కించగా.. కోట్ల రూపాయల్లో ఉంది. దీంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఆగస్టు 1న టాంజానియాకు చెందిన వ్యక్తి దార్ ఎస్ సలామ్ టాంజానియా నుండి అడిస్ అబాబా, దోహా మీదుగా ఢిల్లీకి చేరుకున్నాడు. కాగా.. ఎయిర్ పోర్టులో అనుమానంతో పట్టుకున్నామని అధికారులు తెలిపారు.

Read Also: Garlic: వెల్లుల్లి కూరగాయా..? లేదా మసాలా..? దశాబ్ధాల చర్చకు హైకోర్టు పరిష్కారం..

విచారణలో భాగంగా.. డ్రగ్స్‌తో కూడిన 63 క్యాప్సూల్స్‌ను మింగినట్లు ఆ వ్యక్తి అధికారుల ముందు అంగీకరించినట్లు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. అతన్ని వైద్య చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతని శరీరం నుండి 63 క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు. ఈ క్యాప్సూల్స్‌ను శరీరం నుంచి తీసినప్పుడు అందులో 998 గ్రాముల తెల్లటి పౌడర్ కనిపించింది. సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన వ్యక్తులు ఈ పౌడర్ ను మత్తుమందుగా గుర్తించారు. ఈ క్రమంలో.. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. క్యాప్సూల్‌లో తెల్లటి పౌడర్ వెలువడేది కొకైన్ అని విచారణలో తేలింది. 998 గ్రాముల కొకైన్ విలువ రూ.14.97 కోట్లు అని కస్టమ్స్ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం.. ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుండి మత్తుపదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Gujarat video: రెండు కుక్కలు.. రెండు సింహాల మధ్య ఫైట్.. చివరికి ఏమైందంటే..!

Show comments