SRSP: 61 ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
- 61 వసంతాలు పూర్తి చేసుకున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
- 1963 జులై 26న పోచంపాడు వద్ద శంకుస్థాపన చేసిన నెహ్రూ
- 61 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నెహ్రూ విగ్రహానికి పూలమాలలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRSP: ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నేటితో 61 వసంతాలు పూర్తి చేసుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగుకు ఆధారంగా ఈ ప్రాజెక్టు నిలుస్తోంది. 1963 జులై 26న నాటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద శంకుస్థాపన చేసి.. దీనిని ఒక ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు. 1978లో ప్రాజెక్టు పూర్తికాగా అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. 2009లో కాంగ్రెస్ సర్కారు హయాంలో ప్రాజెక్టు పైన నెహ్రూ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 112 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించారు. పూడిక కారణంగా ఇది 90.313 టీఎంసీల నీటి నిల్వకు పడిపోయింది. ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కాకతీయ, సరస్వతి, లక్ష్మి కాల్వలను అందుబాటులోకి తెచ్చారు. నిజామాబాద్‌తోపాటు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ప్రాణధారగా నిలిచింది ఈ ప్రాజెక్టు. 60 ఏళ్లుగా ఉత్తర తెలంగాణలోని అయిదు జిల్లాలకు సాగు, తాగు నీరు అందిస్తోంది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు. 1983లో టీడీపీ సర్కారు హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాని నిర్మాణం 1988లో పూర్తి కాగా.. ఆయనే ప్రారంభించారు.
Read Also: MLC Jeevan Reddy: ఇప్పటికైనా మీ విహార యాత్రను ఆపండి.. బీఆర్‌ఎస్ పై జీవన్ రెడ్డి ఫైర్
Also Read
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
61 వసంతాలు పూర్తయిన సందర్భంగా, ప్రాజెక్టు వద్ద గల నెహ్రూ విగ్రహానికి ఎస్‌ఈ శ్రీనివాస్ రావు గుప్తా పూలమాల వేశారు. గోదావరి మాతకు పూజలు చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతం నుంచి గురువారం 22 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ఎగువ గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1072 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 26.76 టీఎంసీల నీరు నిల్వ ఉంది.ఈ ఖరీఫ్ సీజన్‌లో 20 టీఎంసీల వరద నీరు వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!