Spiritual Township in Tirupati: తిరుపతిలో రూ.3వేల కోట్లతో.. 600 ఎకరాల్లో ఆధ్యాత్మిక టౌన్షిప్
- తిరుపతిలో 600 ఎకరాల్లో రూ. 3 వేల కోట్లతో అధ్యాత్మిక టౌన్ షిప్..
- టౌన్ షిప్ నిర్మాణానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ సహకారం కోరిన డెల్లా గ్రూప్..
- టౌన్ షిప్ నిర్మాణ స్వరూపాన్ని మంత్రి అనగానికి వివరించిన డెల్లా గ్రూప్ ప్రతినిధులు..
- ఈ టౌన్ షిప్ లో 5 వేల సంవత్సరాల హిందూ మత సాంస్కృతిక చరిత్రను తెలిపే ఎగ్జిబిషన్..
- ‘వసుదైక కుటుంబం’ పేరుతో ఇతర అన్ని సేవలతో ఇంటిగ్రేటేడ్ ఇంటర్నేషనల్ టౌన్ షిప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spiritual Township in Tirupati: తిరుపతి నగరంలో 600 ఎకరాల విస్తీర్ణంలో రూ. 3,000 కోట్ల వ్యయంతో మెగా ఆధ్యాత్మిక టౌన్షిప్ నిర్మించేందుకు డెల్లా గ్రూప్ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.. తిరుపతిలో త్వరలో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ వివరాలను మంత్రి అనగానికి డెల్లా గ్రూప్ ప్రతినిధులు వివరణాత్మకంగా వివరించారు. ఈ టౌన్షిప్లో 5 వేల ఏళ్ల హిందూ మత సాంస్కృతిక చరిత్రను ప్రతిబింబించే ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
Read Also: Amaravati Farmers: రాజధాని ప్రాంత రైతులతో చంద్రబాబు సమావేశం.. రెండవ దశ భూ సమీకరణకు రైతుల అంగీకారం..!
Also Read
- Sukhbir Singh Badal: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడి
- బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
- NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
‘వసుదైక కుటుంబం’ పేరుతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ టౌన్షిప్..
డెల్లా గ్రూప్ ప్రతినిధులు ప్రాజెక్ట్ ప్రధాన ఆకర్షణగా ‘వసుదైక కుటుంబం’ (Vasudaik Family) పేరిట ప్రపంచ సేవలు, ధార్మిక అధ్యయనం, సాంస్కృతిక వారసత్వ ప్రదర్శనలు, వసతి, విద్య, వినోదం వంటి సేవలను ఒకేచోట ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కేవలం నిర్మాణ ప్రణాళిక కాకుండా, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేసే గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. త్వరిత అనుమతుల కోసం మంత్రి హామీ ఇచ్చారు.. ప్రతినిధుల విజ్ఞప్తికి స్పందించిన మంత్రి అనగాని మాట్లాడుతూ.. ఈ భారీ ఆధ్యాత్మిక ప్రాజెక్ట్‌ను రాష్ట్రం స్వాగతిస్తోంది. టౌన్షిప్ నిర్మాణానికి కావాల్సిన అనుమతులు త్వరగా లభించేలా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.. అలాగే, ఈ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కూడా చర్చిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు.
ఈ ప్రాజెక్ట్‌తో తిరుపతికి కొత్త గుర్తింపు వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు అనగాని.. ఈ టౌన్షిప్ నిర్మాణం పూర్తయితే.. ఆధ్యాత్మిక టూరిజం, అంతర్జాతీయ పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు, సాంస్కృతిక-పర్యాటక అభివృద్ధి.. వంటి రంగాల్లో తిరుపతి కొత్త స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.
తాజావార్తలు
-
Sukhbir Singh Badal: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడి
-
Bank of America: అంబానీ కంపెనీపై అమెరికా బ్యాంక్ కన్ను.. రూ.18,268 కోట్ల భారీ డీల్!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
ట్రెండింగ్
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!