Site icon NTV Telugu

Vizag KGH: విశాఖ కేజీహెచ్‌లో దారుణం.. వైద్యుల నిర్లక్షానికి బాలుడు బలి!

Vizag Kgh

Vizag Kgh

విశాఖ కేజీహెచ్‌లో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్షానికి ఓ బాలుడి ప్రాణం బలైంది. కాలు విరిగిందని ఆస్పత్రికు తీసుకొస్తే కోమాలోకి వెళ్లాడు బాలుడు. 6 ఏళ్ల బాలుడు ఆర్ధోపెడిక్ వార్డులో చికిత్స పొందుతు మృతి చెందాడు. దాంతో పెద్దాసుపత్రిలో మరోసారి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. బాలుడి మృతితో తల్లిదండ్రులు ఆందోళన చేశారు. వైద్య సేవలు లోపం వల్లే తమ బిడ్డ చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మూడు రోజుల క్రితం ద్వారకానగర్ నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ సమీపంలో ఖాళీ ప్రదేశంలో ఆడుకుంటూ ఆరేళ్ళ అక్షయ్ కుమార్ గోతిలో పడి ప్రమాదానికి గురయ్యాడు. ఈనెల 4 సాయంత్రం కేజీహెచ్‌కు కుటుంబ సభ్యులు అతడ్ని తరలించారు. ఆపరేషన్ తర్వాత కూడా తమ బిడ్డ కోలుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడికి ఫిట్స్ వచ్చినా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version