Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports 6 Wickets In 6 Balls Australia Bowler Gareth Morgan Took Six Wickets In Six Balls

6 Balls in 6 Wickets: క్రికెట్‌ చరిత్రలో అరుదైన రికార్డు.. 6 బంతుల్లో 6 వికెట్లు!

Published Date :November 14, 2023 , 7:38 am
By Sampath Kumar
6 Balls in 6 Wickets: క్రికెట్‌ చరిత్రలో అరుదైన రికార్డు.. 6 బంతుల్లో 6 వికెట్లు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Australian bowler Gareth Morgan takes 6 wickets in 6 balls: క్రికెట్‌ ఆటలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. ఎవరూ ఊహించని రీతిలో బ్యాటర్లు డబుల్ సెంచరీలు చేస్తే.. బౌలర్లు హ్యాట్రిక్ తీస్తుంటారు. ఇప్పటివరకు 6 బంతుల్లో 6 సిక్సులు నమోదయినా.. 6 బంతుల్లో 6 వికెట్లు ఎవరూ తీయలేదు. తాజాగా ఈ ఫీట్ నమోదైంది. ఆస్ట్రేలియా క్లబ్‌ క్రికెటర్‌ గారెత్‌ మోర్గాన్‌.. 6 బంతుల్లో 6 వికెట్లు పడగొట్టాడు. గోల్డ్‌కోస్ట్‌ ప్రిమియర్‌ లీగ్‌ డివిజన్‌-3 టోర్నీలో నెరాంగ్‌ క్లబ్‌కు సారథ్యం వహిస్తున్న మోర్గాన్‌.. సర్ఫర్స్‌ పారడైజ్‌ సీసీపై ఈ అరుదైన ఘనత సాధించాడు.

40 ఓవర్లలో 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్ఫర్స్ ప్యారడైజ్‌ 39 ఓవర్లకు 4 వికెట్స్ కోల్పోయి 174 రన్స్ చేసింది. 6 బంతుల్లో 5 పరుగులు చేస్తే సర్ఫర్స్ విజయం సాధిస్తుంది. ఇక సర్ఫర్స్ విజయం లాంఛనమే అనుకున్నారు అందరూ. ఈ తరుణంలో ముద్గీరాబా నెరంగ్ కెప్టెన్ గారెత్‌ మోర్గాన్ అద్భుతం చేశాడు. చివరి ఓవర్‌లో ఒక్క పరుగూ ఇవ్వకుండా.. ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. గారెత్‌ దెబ్బతో సర్ఫర్స్ జట్టు ఆలౌట్ అయింది. దాంతో ముద్గీరాబా నెరంగ్ టీమ్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది.

Also Read: Bay of Bengal: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు!

గారెత్‌ మోర్గాన్ వేసిన 6 బంతుల్లో తొలి నాలుగు క్యాచ్‌ ఔట్స్ కాగా.. మిగతా రెండు బౌల్డ్‌ ఔట్ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గారెత్ 7 ఓవర్లు వేసి 7 వికెట్స్ పడగొట్టి 16 రన్స్ ఇచ్చాడు. అంతకుముందు సర్ఫర్స్ ప్యారడైజ్ ఓపెనర్ జేక్ గార్లాండ్‌ని గారెత్‌ ఔట్‌ చేశాడు. గారెత్‌ బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. 39 పరుగులతో టాప్‌ స్కోరర్‌గానూ నిలిచాడు. ఓటమి అంచుల వరకూ వెళ్లిన ముద్గీరాబా నెరంగ్ జట్టును గారెత్‌ ఊహించని విధంగా గెలిపించాడు.

ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఇదివరకు ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన సందర్భాలు ఉన్నా.. 6 వికెట్స్ ఎవరూ తీయలేదు. 2011లో వెల్లింగ్టన్‌పై ఒటాగో తరఫున న్యూజిలాండ్‌ పేసర్ నీల్ వాగ్నర్, 2013లో అభానీ లిమిటెడ్‌పై యూసీబీ-బీసీబీ XI తరఫున బంగ్లాదేశ్ బౌలర్ అల్ అమీన్ హోస్సేన్ ఒకే ఓవర్లో ఐదు వికెట్లు పడగొట్టారు. కర్ణాటక తరఫున 2019లో అభిమన్యు మిథున్‌ హరియాణాపై 5 వికెట్స్ తీశాడు. వీరిని గారెత్‌ మోర్గాన్ అధిగమించాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 6 Balls 6 Wickets
  • 6 Wickets In 1 Over
  • 6 Wickets In 6 Balls
  • 6 Wickets In An Over
  • Gareth Morgan

తాజావార్తలు

  • Mega El Nino: 149 ఏళ్ల తర్వాత ‘‘మెగా ఎల్ నినో’’.. భారత్‌లో కరువు తప్పదా..?

  • India’s E85 Fuel Revolution: భారత్‌లో ఇంధన విప్లవం.. ఇక పెట్రోల్ కాదు, ఆల్కహాల్‌తో వాహనాల పరుగులు!

  • Allu Arjun : ‘ముంబై’లో బన్నీ సెటిల్మెంట్ వెనుక అసలు నిజమిదే

  • Mallikarjun Kharge: ప్రధాని నరేంద్రమోడీ ఒక టెర్రరిస్ట్.. కాంగ్రెస్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

  • Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!

ట్రెండింగ్‌

  • రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!

  • AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!

  • Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్‌కు వస్తాను.!

  • 200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్‌లోనే POCO M8s 5G లాంచ్.!

  • Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions