దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు కలవరపెడుతున్నాయి. కరోనా సబ్ వేరియంట్ JN-1 ప్రపంచాన్ని వణికిస్తోంది. కేరళలో తిష్ట వేసిన వేరియంట్ అన్ని రాష్ట్రాల్లో వ్యాపిస్తుంది. తెలంగాణలోనూ కరోనా మహమ్మారి మళ్లీ ప్రవేశించింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. 538 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి కరోనా వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇంకా 42 మంది రిపోర్ట్స్ పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కరోనా కేసులు హైదరాబాద్ లోనే వెలుగుచూశాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ ఒకరు వైరస్ నుంచి కోలుకున్నారని తెలిపింది. నిన్న నలుగురికి పాజిటివ్ సోకింది. ప్రస్తుతం 14 మంది ఐసోలేషన్ లో ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని హెచ్చరించింది. మరోవైపు దేశంలో ఇవాళ ఒక్కరోజు 614 కేసులు, 3 మరణాలు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది.
Read Also: Hyderabad : వామ్మో.. ఏందయ్యా ఇది.. మెట్రో నిండా మగవాళ్లే..
దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ JN -1 మహమ్మారి కట్టడిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులతో ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో తెలంగాణ వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ JN – 1 మహమ్మారి కట్టడి పై తీసుకుంటున్న ముందస్తు చర్యలను మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడించారు.
Read Also: Tollywood: ఈ ఏడాది దుమ్మురేపిన మహిళా నిర్మాతలు