Rajasthan: రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఓ వృద్ధురాలు తల్లి అయింది. ఈ 58 ఏళ్ల మహిళ కవలలకు జన్మనిచ్చింది. వారిలో ఒకరు కుమారుడు, ఒకరు కుమార్తె. ప్రసవం తర్వాత బిడ్డ, తల్లి ఇద్దరూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇన్నేళ్ల తర్వాత ఆ కుటుంబంలో పిల్లలు పుట్టడంతో ఇల్లంతా ఆనందోత్సాహాలతో మారుమోగిపోయి, చుట్టుపక్కల సంబరాల వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. 58 ఏళ్ల షేరా బహదూర్‌కు పిల్లలు లేరు. దీంతో చివరి ప్రయత్నంగా ఆమె IVF ని ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. ఐవీఎఫ్ సాయంతో పిల్లలకు జన్మనిచ్చేందుకు షేరా రెండేళ్లపాటు చికిత్స చేయించుకుంది. ఎట్టకేలకు ఆమె గర్భం దాల్చి 9 నెలల తర్వాత ఒకరు కాదు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ వయసులో కూడా పిల్లలు కావాలని, దాని కోసం ఎంతగానో పోరాడుతున్న ఆమెను అందరూ కొనియాడుతున్నారు.
Read Also:Work Stress Tips: ఆఫీసులో పని వల్ల ఒత్తిడి ఉందా?.. ఇలా చెక్ పెట్టండి!
ఈ IVF ప్రక్రియ అంతా బికనీర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనే జరిగింది. డాక్టర్ షెఫాలీ దధీచ్ షేరాకు పూర్తిగా సహాయం చేసి, ఈ వయస్సులో కూడా తల్లి కావడానికి మార్గం చూపారు. రెండేళ్ల క్రితం షేరా తన వద్దకు వచ్చినట్లు డాక్టర్ షెఫాలీ చెప్పారు. ఈ రెండేళ్లలో ఆయనకు మంచి చికిత్స అందించారు. హార్మోన్లను సరిచేయడానికి ఒక సంవత్సరం పాటు చికిత్స చేసి, ఆపై IVF ప్రక్రియను ప్రారంభించారు. ఐవీఎఫ్ సహాయంతో 50 ఏళ్ల వయసులో కూడా తల్లి కావడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే షేరా వయస్సు, ఆమె కోరిక విని అందరూ ఆశ్చర్యపోయారని డాక్టర్ షెఫాలీ చెప్పారు. ఆమెపై IVF విజయవంతమైంది. ఆమె 58 సంవత్సరాల వయస్సులో కూడా తల్లి అయ్యింది. ఇప్పుడు ఈ వయసులో షేరా తల్లి కావడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Read Also:Etala Jamuna: ఈటల జమున సంచలన ఆరోపణ.. రాజేందర్ ను చంపేందుకు కుట్ర..