Site icon NTV Telugu

OYO 500 Hotels: దేశంలో 500 కొత్త ‘ఓయో’ హోటళ్లు.. పండగ చేసుకోనున్న..!

Oyo Hotels

Oyo Hotels

OYO Eyes on 500 Hotels In World Cup 2023 Host Cities: వన్డే ప్రపంచకప్‌ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ ఇటీవల రిలీజ్ చేసిన విషయం తెగెలిసిందే. భారత్‌లో అక్టోబర్‌, నవంబర్‌లో మెగా టోర్నీ మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో ఈ మహా సమరం మొదలుకానుంది. నవంబర్‌ 19న జరిగే ఫైనల్‌తో వన్డే ప్రపంచకప్‌ ముగుస్తుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. 48 మ్యాచ్‌లకు భారత్‌లోని 10 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి.

వన్డే ప్రపంచకప్‌ 2023కి ఇంకా మూడు నెలల సమయం ఉంది. అయితే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చే పట్టణాల్లో హోటల్‌ సేవలకు డిమాండ్‌ భారీగా పెరిగింది. దీంతో ఆన్‌లైన్‌ ట్రావెల్, హోటల్‌ బుకింగ్‌ సేవలు అందించే సంస్థలు ఇప్పటినుంచే తమ వ్యూహాలపై దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ హోటల్‌ బుకింగ్‌ సేవల సంస్థ ‘ఓయో’.. ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరిగే పట్టణాల్లో 500 హోటళ్లను అదనంగా చేర్చనున్నట్లు తెలిపింది.

Also Read: ADAS technology: కార్లలో ADAS ఫీచర్లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. ఈ టెక్నాలజీ ఉన్న కార్లు ఇవే..

వన్డే ప్రపంచకప్‌ 2023 మ్యాచ్‌లను చూసేందుకు వచ్చే క్రికెట్ ఫాన్స్ నుంచి హోటల్‌ బుకింగ్‌కు భారీ డిమాండ్‌ ఉంటుందన్న అంచనాలతో.. రాబోయే మూడు నెలల్లో కొత్త హోటళ్లను తమ పరిధిలోకి చేర్చుకోనున్నట్టు ఓయో అధికారి ఒకరు తెలిపారు. అభిమానులు త్వరగా స్టేడియం చేరేలా.. కొత్త హోటళ్లు స్టేడియం పక్కనే ఉండేలా చూస్తున్నామని పేర్కొన్నారు. మారుమూల, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సౌకర్యవంతమైన, తక్కువ ధరలో ఆతిథ్యం ఇవ్వడమే తమ లక్ష్యమని ఓయో అధికారి చెప్పారు.

వన్డే ప్రపంచకప్‌ 2023 మ్యాచ్‌లకు ధర్మశాల, ఢిల్లీ, పుణె, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ నగరాల్లోనే 500 హోటళ్లను అదనంగా ఓయో ఉంచనుంది. స్టేడియం పక్కనే బిల్డింగ్ దొరకడం కష్టం కాబట్టి.. ఓయో ఇప్పటి నుంచే వెతికే పనిలో ఉందట.

Also Read: MS Dhoni-R Ashwin: ఎంఎస్ ధోనీకి ఇదే నా చివరి బర్త్‌డే విషెస్‌.. వైరల్‌గా ఆర్ అశ్విన్ ట్వీట్!

Exit mobile version